Telangana Weather Update: చలి తీవ్రత పెరుగుతోంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో కూడా చలి విపరీతంగా పెరుగుతోంది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. రాత్రుల్లు మరింత దారుణంగా చలి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.
Telangana Weather Update: వాతావరణం ఒక్కసారిగా చల్లబడి పోయింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలకు పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో చలి తీవ్రత పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లో కూడా చలి పెరిగింది.
వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తారు. ప్రజలు అలెర్ట్‌గా ఉండాలని చెబుతోంది. లేదంటే జబ్బుల బారిన పడే అవకాశం ఉందని చెబుతోంది. అందుకే ప్రజలు బయటకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సీజనల్ జబ్బులు చుట్టుముడతాయని హచ్చరిస్తోంది.
మొన్నటి వరకు వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడిన తెలుగు రాష్ట్రాల ప్రజలు, ఇప్పుడు చలితీవ్రతతో తీవ్ర ఇబ్బందులు పడటం తప్పేలా లేదు. ముఖ్యంగా ఏపీలో మరో అల్పపీడన ఏర్పడనుందని ఐఎండీ హెచ్చరించింది. అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకుంది.
తెలంగాణలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చలి పెరిగింది. రాత్రుల్లు మరింత దారుణంగా చలి పెరిగిపోతుంది.
తెలంగాణలో ముఖ్యంగా మెదక్ జిల్లాలో 12 డిగ్రీల కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఆదిలాబాద్‌లో కూడా 12 డిగ్రీలు నమోదు అయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో చలి తీవ్రత బాగా పెరిగిపోయింది.
హైదరాబాద్ శివారు ప్రాంతాలైన ఇబ్రహీం పట్నం, మహేశ్వరంలో తీవ్రంగా చలి పెరిగింది 12 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇక ఆదిలాబాద్‌లో కూడా చలి తీవ్రత పెరిగింది.
వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వరుసగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మెదక్ జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. కాబట్టి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ సందర్భంగా ప్రజలు వేడి ఆహారం, బాగా ఉడికించి తినాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. చలిలో బయటకు వెళ్లేటప్పుడు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. స్వేటర్లు, మఫ్లార్‌తో కాళ్లు, చేతులు కవర్ చేసుకోవాలి. లేకపోతే జబ్బులు చుట్టుముడతాయి.