ముంబై: భారత మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలొస్తున్నాయి. కరోనా బాధితుల సహాయార్ధం ధోనీ సేవా సంస్థకు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించగా దీనిపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతోంది. క్రికెటర్‌గా వందల కోట్ల రూపాయలను సంపాదించిన ధోనీ కరోనా బాధితుల కోసం కేవలం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని మాత్రమే ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కరోనా మహమ్మరి తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో ప్రస్తుత తరుణంలో దేశ వ్యాప్తంగా పలువురు తమవంతు సహాయంగా పెద్ద మొత్తంలో విరాళాలు ప్రకటిస్తుండగా వందల కోట్ల ఆదాయం కలిగిన ధోనీ కేవలం లక్ష రూపాయలు మాత్రమే ఆర్థిక సహాయం అందజేయడాన్నితన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: ప్రధాని సహాయనిధికి 20 కోట్లు విరాళం..!!


ఐపీఎల్, ఎన్నో యాడ్స్ ద్వారా ధోనీ ఇప్పటికే కోట్లాది రూపాయలు సంపాదించాడని, దేశం ఆపదలో ఉన్న సమయంలో అండగా నిలువడంలో విఫలమయ్యాడని  విమర్శిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా చాలా మంది ధోనీపై విమర్శలు తీవ్ర రూపం దాల్చాయి. ఇదిలావుండగా ఈ వార్తలను ధోనీ భార్య సాక్షి తీవ్రంగా ఖండించారు. కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, జర్నలిజం విలువలు పాటించాలని, సంయమనం పాటించాలన్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..         


 Read Also: మళ్ళీ పెరిగిన చికెన్, గుడ్డు ధరలు....