'కరోనా వైరస్' మహమ్మారిని ఎదుర్కునేందుకు మనసున్న మారాజులు ముందుకొస్తున్నారు. ఇప్పటి వరకు వీఐపీలు, సెలబ్రిటీలు, రాజకీయ, సినీ ప్రముఖులు విరాళాలు ఇవ్వడం చూశాం. ఇప్పుడు ఉద్యోగులు కూడా తమ వంతు సాయం అందిస్తున్నారు.
ఇందులో Airports Authority of India ఉద్యోగులు ముందు వరుసలో ఉన్నారనే చెప్పాలి. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును అందుకుని ఏకంగా 20 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. మొత్తం ఉద్యోగుల తరఫున 20 కోట్ల రూపాయల విరాళాన్ని త్వరలోనే ప్రధాన మంత్రి సహాయ నిధికి అందించనున్నారు. ఎవరైనా విరాళాలు ఇచ్చే వారు ఉంటే #PMCARES అనే పేరుతో విరాళం ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. ఇందుకోసం బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా ఇచ్చారు.
లాక్ డౌన్ విధించినందుకు క్షమించండి..!!
ప్రధాని పిలుపుతో ఎందరో మనసున్న మారాజులు ముందుకొస్తున్నారు. కరోనా మహమ్మారిని భారత్ నుంచి పంపించేందుకు తమ వంతు సాయం చేస్తున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..