Sakshi Dhoni Reveals MS Dhoni Retirement Secret: కోట్లాది మంది అభిమానులకు షాక్ ఇస్తూ.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 2020లో సరిగ్గా 19.29 గంటలకు ఆగస్ట్ 15న అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే ఐపీఎల్‌లో మాత్రం కొనసాగుతున్నాడు. ఇండిపెండెన్స్ డే రోజునే ఎంఎస్‌ ధోని ఎందుకు క్రికెట్‌ను రిటైర్మెంట్ ప్రకటించాడు..? అనే విషయం చాలామందికి తెలియదు. తాజాగా దీనికి వెనుక ఉన్న రహాస్యాన్ని ధోని భార్య సాక్షి వెల్లడించారు. మంగళవారం ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రివీల్ చేశారు. ఆగస్టు 15న ధోని తల్లి దేవకీ దేవి పుట్టినరోజు కూడా అని చెప్పారు. సాక్షి మంగళవారం తన అత్తగారు దేవకీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఫొటోలను పంచుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జూలై 7, 1981న జన్మించిన ఎంఎస్ ధోనీ పాన్ సింగ్ ధోని, దేవకీ దేవి దంపతులకు చిన్న కుమారుడు. ధోనికి అన్న నరేంద్ర సింగ్ ధోని, అక్క జయంతి గుప్తా ఉన్నారు. దేవకీ దేవి తన గృహిణిగా ఉన్నారు. రాంచీలో ఉన్న నేపథ్యంలో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని ఎంచుకుంది. ఇటీవల మీడియాతో మాట్లాడిన సాక్షి.. తన అత్త దేవకీతో ఉన్న సంబంధాన్ని పంచుకున్నారు. వివాహమైన తొలినాళ్లలో ధోని కుటుంబంతో తాను ఎలా అల్లరి చేశారో కూడా సాక్షి వెల్లడించారు. పెళ్లికి ఒకరోజు ముందు తాను మా అత్తగారిని కలిశానని చెప్పారు. ఇద్దరం స్నేహితుల్లానే ఉంటామన్నారు. ప్రతిదీ పంచుకుంటామని తెలిపారు. అన్ని విషయాల్లో తనకు మద్దతుగా ఉంటారని చెప్పుకొచ్చారు. 


ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ అయ్యి మూడేళ్లు అయినా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. గత నెలలో 42 ఏళ్లు పూర్తి చేసుకున్ని ధోని.. చెన్నైకు ఐపీఎల్ ట్రోఫీని ఐదోసారి అందించాడు. మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్న ధోని.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇక ధోని త్వరలోనే సినిమాల్లోకి వస్తాడని ప్రచారం జరుగుతోంది. దళపతి విజయ్‌తో కలిసి తమిళ సినిమాలో యాక్ట్ చేస్తాడని రూమర్లు వస్తున్నాయి. 


Also Read: AP Politics: వచ్చే ఎన్నికల్లో పోటీపై బాలినేని ప్రకటన.. జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తారా..?  


Also Read: Shilpa Shetty: చెప్పులు ధరించి జాతీయ జెండాను ఎగురవేసిన శిల్పాశెట్టి.. నెట్టింట ట్రోలింగ్  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook