టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, మరో అంతర్జాతీయ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్‌ని ఆటపట్టిస్తోన్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టులో సానియా, ఫెదరర్‌తో మాట్లాడుతూ బటర్ చికెన్ కన్నా హైదరాబాద్ బిర్యానీ బాగుంటుందని చెవిలో చెబుతున్నట్లు ఓ ఫోటో పోస్టు చేయడం గమనార్హం. అయితే ఈ పోస్టుకి ఇప్పటికే చాలా పాజిటివ్ కామెంట్లతో పాటు నెగటివ్ కామెంట్లు కూడా వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సానియా హైదరాబాదీ కావడం వల్లే బిర్యానీని పొగిడిందని.. పంజాబీ వంటకమైన బటర్ చికెన్‌ను పట్టించుకోలేదని అనేకమంది పోస్టు చేశారు. కొందరైతే ఈ పోస్టు అర్థం కాలేదన్నారు. రోజర్, సానియా మిక్స్‌డ్ డబుల్స్ ఆడుతున్నప్పుడు ఎవరో తీసిన ఫోటోకి సానియా ఫన్నీ కామెంట్ రూపంలో ఈ పోస్టు క్రియేట్ చేసి పెట్టిందనే విషయాన్ని ఆలస్యంగా గ్రహించారు ఆమె అభిమానులు.