Sania Mirza announces retirement: భారత స్టార్​ టెన్నిస్​ ప్లేయర్​ సానియా మీర్జా (Sania Mirza ) షాకిచ్చింది. 2022 సీజన్​ తర్వాత ఆటకు వీడ్కోలు (Sania Mirza Retirement) పలకబోతున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో ఓటమి చెందిన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సానియా, ఉక్రెయిన్ భాగస్వామి నదియా కిచ్నోక్ ఆస్ట్రేలియన్ ఓపెన్ (Australian Open) తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టారు.  స్లోవేనియాకు చెందిన తమరా జిదాన్‌సెక్‌-కాజా జువాన్‌ జోడీ 4-6, 6-7(5)తో గంటా 37 నిమిషాల్లో ఓటమి చవిచూశారు. అయితే సానియా ప్రస్తుతం అమెరికాకు చెందిన రాజీవ్ రామ్‌తో కలిసి ఈ గ్రాండ్‌స్లామ్ మిక్స్‌డ్ డబుల్స్‌లో పాల్గొంటుంది.


Also Read: Dhoni Buys Land Rover: ధోనీ గ్యారేజ్ లోకి మరో వింటేజ్ కారు.. వింటేజ్ ల్యాండ్ రోవర్ కొనుగోలు చేసిన మాజీ కెప్టెన్


''కొన్ని రోజులుగా మోకాలు, మోచేయి నొప్పితో బాధపడుతున్నా. అయితే ఆస్ట్రేలియా ఓపెన్‌ ఓటమికి అవి కారణాలుగా చెప్పదల్చుకోలేదు. అలా అని కెరీర్‌ను పొడిగించనూలేను. ఇదే చివరి సీజన్‌ అని మాత్రం చెప్పగలను'' అంటూ సానియా చెప్పుకొచ్చింది. 


గ్రాండ్‌స్లామ్ గెలిచిన మొదటి భారతీయ మహిళ టెన్నిస్ క్రీడాకారిణి సానియా. మహిళల డబుల్స్‌లో ఆమె నంబర్‌వన్‌ ర్యాంక్‌కు చేరుకుంది. కెరీర్‌లో ఆరు గ్రాండ్‌స్లామ్‌ (Grandslam) టైటిల్స్‌ సాధించింది. వీటిలో మూడు టైటిల్స్ మహిళల డబుల్స్‌, మూడు మిక్స్‌డ్ డబుల్స్‌లో గెలుచుకుంది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్ వంటి ఈవెంట్లలో కూడా పతకాలు సాధించింది. దాదాపు 91 వారాల పాటు డబుల్స్‌లో సానియా మీర్జా నంబర్‌వన్‌గా కొనసాగింది. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook