Sunil Gavaskar slams Sanju Samson after scores 5 Runs in IND vs SL 1st T20: మంగళవారం (జనవరి 3) ముంబైలోని వాంఖడే స్టేడియంలో శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో సంజూ శాంసన్ షాట్ ఎంపికపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ నిరాశ వ్యక్తం చేశారు. రాకరాక వచ్చిన అవకాశాన్ని శాంసన్ సద్వినియోగం చేసుకోలేకపోయాడన్నారు. భారీ షాట్ ఆడాలనే ఆతృతలో మూల్యం చెల్లించుకున్నాడని లిటిల్ మాస్టర్ పేర్కొన్నారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టీ20లో భారత్ 2 పరుగులతో గెలిచిన విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాగా ఆడినా సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోవడం లేదంటూ బీసీసీఐపై అభిమానులు విమర్శలు కురిపించిన విషయం తెలిసిందే. దాంతో శ్రీలంకతో సిరీస్‌కు అతడిని ఎంపిక చేసింది. తొలి మ్యాచ్‌లో నాలుగో స్థానంలో వచ్చిన శాంసన్‌ కేవలం 5 పరుగులకే ఔట్ అయ్యాడు. ఏడో ఓవర్‌ మూడో బంతికి మిడ్‌ వికెట్‌ మీదుగా వచ్చిన క్యాచ్‌ను శ్రీలంక ఫీల్డర్‌ వదిలేయడంతో.. శాంసన్‌కు ఓ లైఫ్ లభించింది. అయితే ఐదో బంతికి  భారీ షాట్‌ ఆడే ప్రయత్నం చేసి క్యాచ్ ఔట్ అయ్యాడు. దాంతో ఫాన్స్ సహా మాజీలు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 


తొలి టీ20 సందర్భంగా కామెంటరీ చేస్తున్న సునీల్‌ గవాస్కర్‌.. సంజూ శాంసన్ షాట్ ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 'సంజూ శాంసన్ భారీ షాట్‌ కొట్టేందుకు యత్నించి.. థర్డ్‌మ్యాన్‌ దిశలో ధనంజయ చేతికి చిక్కాడు. భారీ షాట్ ఆడాలనే ఆతృతలో మూల్యం చెల్లించుకున్నాడు. ప్రతిభాపరంగా సంజూ మంచి ఆటగాడు. కానీ అతని షాట్ ఎంపిక కొన్నిసార్లు దారుణంగా ఉంటునాయి. దాంతో సంజూ విఫలమవుతున్నాడు. ఇదీ అటువంటి సందర్భమే. అయితే ఈసారి అతడు తీవ్ర నిరాశకు గురయ్యుంటాడు' అని సన్నీ చెప్ప్పుకొచ్చారు. 


సంజూ శాంసన్ ప్రదర్శనపై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ కూడా స్పందించారు. 'సంజూ శాంసన్‌కు ఉన్న టాలెంట్‌ గురించి మనం అందరం మాట్లాడుకుంటున్నాం. కానీ అతడు ఈ అవకాశాలను సద్వినియోగ పరుచుకోవాలి' అని గౌతీ పేర్కొన్నారు. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్‌ విజయం చివరి ఓవర్లో సాధించింది. అక్షర్ పటేల్ 13 పరుగులను డిఫెండ్ చేసి ఓటమి నుంచి తప్పించాడు. రెండో టీ20 మ్యాచ్‌ గురువారం పుణెలో జరగనుంది.


Also Read: IND vs SL: అక్షర్ పటేల్ తెలివితేటలను మెచ్చుకున్న బీసీసీఐ మాజీ సెలెక్టర్!


Also Read: Marnus Labuschagne Lighter: మ్యాచ్ మధ్యలో లైటర్ అడిగిన లబూషేన్.. తలపట్టుకున్న ఆస్ట్రేలియా మేనేజ్మెంట్!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.