Sarfaraz Khan in Hospital: టీమిండియా యంగ్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ ఆసుపత్రిలో చేరాడు. తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఇటీవల రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణించిన సర్ఫరాజ్.. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీలో ముంబై తరఫున బరిలో దిగుతున్నాడు. అయితే కడుపునొప్పి రావడంతో ఆసుపత్రి పాలయ్యాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ ఆడేందుకు ముంబై జట్టు రాంచీలో ఉంది. తమ జట్టు కీలక బ్యాట్స్‌మెన్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ ఆస్పత్రిలో చేర్పించినట్లు మేనేజ్‌మెంట్ తెలిపింది. ఆదివారం సర్వీసెస్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా సర్ఫరాజ్ ఆడలేదు.


కిడ్నీలో రాళ్లు ఉన్నాయని సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషాద్ ఖాన్ తెలిపారు. 'ఇది చిన్నది కానీ చాలా బాధను కలిగిస్తోంది. సర్ఫరాజ్ ఖాన్‌ చాలా రోజులుగా బాధపడుతున్నాడు. చాలా నొప్పిని అనుభవించాడు. అందుకే ఆసుపత్రికి తీసుకెళ్లవలసి వచ్చింది. ఇప్పుడు బాగానే ఉన్నాడు..' అంటూ చెప్పుకొచ్చారు. 


సర్ఫరాజ్ ఖాన్ సోమవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. ముంబై తదుపరి మ్యాచ్‌లో మహారాష్ట్రతో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌కు  సర్ఫరాజ్ ఫిట్‌గా ఉంటాడని భావిస్తున్నట్లు జట్టు అధికారి ఒకరు తెలిపారు. అతను ఒక రాత్రి ఆసుపత్రిలో ఉండడం ముందు జాగ్రత్తగా తీసుకున్న నిర్ణయమన్నారు. గురువారం జరిగే మ్యాచ్‌లో అతను ఆడతాడనే నమ్మకంతో ఉన్నామన్నారు.


ఈ సీజన్‌లో రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్. రంజీ ట్రోఫీ సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్.. 122.75 సగటుతో 982 పరుగులు చేశాడు. ఇందులో  4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సర్ఫరాజ్ ఇప్పటివరకు 80 కంటే ఎక్కువ సగటుతో పరుగులు సాధించాడు. ఈ ఫార్మాట్‌లో 2000 కంటే ఎక్కువ పరుగులు చేసిన సర్ఫరాజ్.. సర్ డాన్ బ్రాడ్‌మన్ మాత్రమే తరువాత అత్యధిక సగటు కలిగి ఉన్న ఆటగాడిగా నిలిచాడు. సర్ఫరాజ్ దులీప్ ట్రోఫీ 2022లో కూడా సెంచరీ చేశాడు.


Also Read: Super Star Krishna Health update : హాస్పిటల్లో సూపర్ స్టార్ కృష్ణ.. ఆందోళనలో అభిమానులు


Also Read: Kolhapur Groom Protest:  సైకిల్‌పై పెళ్లికొడుకు ఊరేగింపు.. ఇదెక్కిడి నిరసన సామీ..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి