Sarfaraz Khan: పరుగులు చేయడమే అతడికి తెలుసు.. సెలెక్షన్ గురించి అస్సలు పట్టించుకోడు! అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు
R Ashwin Statement On Sarfaraz Khan India Selection Debate. దేశవాళీ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ సెలెక్షన్ గురించి పట్టించుకోకుండా.. తన పని చేసుకుంటూ పోతున్నాడు అని టీమిండియా వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ పేర్కొన్నాడు.
R Ashwin says Sarfaraz Khan Not Caring About Selection: ప్రస్తుతం సోషల్ మీడియాలో దేశవాళీ క్రికెటర్ 'సర్ఫరాజ్ ఖాన్' పేరు బాగా వినిపిస్తోంది. ఇందుకు కారణం దేశవాళీ క్రికెట్‌లో భారీగా పరుగులు చేయడం ఒకటైతే.. టీమిండియాకు ఎంపిక కాకపోవడం మరోకటి. ఇటీవల రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ అదరగొట్టాడు. 600 లకు పైగా రన్స్ బాదాడు. 2019-20 సీజన్‌లో 900 రన్స్ చేశాడు. అయినా కూడా ఆస్ట్రేలియాతో జరిగే తొలి రెండు టెస్టులకు మాత్రం ఎంపిక కాలేకపోయాడు. భారత జట్టు అవకాశం కోసం ఎదురుచూస్తున్న క్రికెటర్లలో సర్ఫరాజ్‌ఒకడు. టీ20, వన్డేలలో రాణిస్తున్న సూర్యకుమార్ యాదవ్‌కు అవకాశం వచ్చింది.
ఫిట్‌గా ఉండడనే కారణంతోనే సర్ఫరాజ్ ఖాన్‌ను పక్కన పెట్టారనే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వచ్చాయి. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ బీసీసీఐ సెలెక్షన్ కమిటీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాజూగ్గా ఉండాలంటే ఫ్యాషన్ షోలకు వెళ్లి.. మనుషులను తీసుకొచ్చి బ్యాటింగ్, బౌలింగ్ నేర్పించమని ఫైర్ అయ్యారు. సన్నీ వ్యాఖ్యలపై బీసీసీఐ సెలెక్టర్ శ్రీధరన్ శరత్ స్పందించారు. తమ దృష్టిలో సర్ఫరాజ్ ఉన్నాడని, జట్టులో సమతూకం లాంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకొంటామన్నారు. తాజాగా ఈ విషయంపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ స్పందించాడు.
'సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ గురించి చెప్పడానికి ఎక్కడ నుంచి మొదలుపెట్టాలో అర్థం కావడం లేదు. ఇప్పటికే సర్ఫరాజ్ భారత జట్టులోకి సెలెక్ట్ అవుతాడా? లేదా? అనే విషయంపై పెద్ద చర్చ జరిగింది. అయితే అతడు సెలెక్షన్ గురించి పట్టించుకోకుండా.. తన పని చేసుకుంటూ పోతున్నాడు. 2019-20 దేశవాళీ సీజన్‌లో 900 పరుగులు, 2020-21 సీజన్‌లో వెయ్యి పరుగులు చేశాడు. ఈ సీజన్‌లోనూ ఇప్పటివరకు 600 రన్స్ బాదాడు. పరుగులు చేసి తన ఉద్దేశం ఏంటో సర్ఫరాజ్ చాటి చెప్పాడు' అని ఆర్ అశ్విన్ అన్నాడు.
'సర్ఫరాజ్ ఖాన్ కేవలం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ తలుపులను మాత్రమే బాదలేదు. అందులోని సభ్యులను కూడా దహించి వేసేలా చేశాడు. దురదృష్టవశాత్తూ సర్ఫరాజ్ భారత జట్టులోకి ఎంపిక కాలేకపోయాడు. అతడు సెలెక్ట్ కాకపోయినా.. ముంబై తరఫున ఢిల్లీ మీద భారీ ఇన్నింగ్స్ ఆడాడు. త్వరలోనే సర్ఫరాజ్ జాతీయ జట్టులోకి వస్తాడని అనుకుంటున్నా' అని వెటరన్ స్పిన్నర్ ఆర్ అశ్విన్ ధీమా వ్యక్తం చేశాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.