IPL 2020 కి నిండా 2 నెలల సమయం కూడా లేకపోవడంతో ఆటగాళ్లు సీరియస్‌గా ప్రాక్టీస్‌పై దృష్టి పెట్టారు. లాక్ డౌన్ ఉన్నంత కాలం ప్రాక్టీస్‌కి మైదానంలోకి వెళ్లే పరిస్థితి లేకపోయింది. కానీ కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు (Kings eleven Punjab) ఆటగాడు మహ్మద్ షమి మాత్రం లాక్‌డౌన్ కాలంలో తన ఫామ్ హౌజ్‌లోని అకాడమిలో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తూ గడిపాడు. తాజాగా షమీతో పాటు ముంబై ఇండియన్స్ జట్టు బ్యాట్స్‌మేన్ సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan)  కూడా ప్రాక్టీసులో జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని షమీనే తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా క్రికెట్ ప్రియులతో పంచుకున్నాడు. ఉత్తర్ ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కి సమీపంలోని అమ్రోహాలో షమీ ఫామ్ హౌజ్‌లో ఈ ప్రాక్టీసింగ్ సెషన్ జరుగుతోంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షమి ఫామ్ హౌజ్‌లో షమి బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా... అతడు వేసే బంతులతోనే సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇంకేం టీమ్ మేట్స్ వెంట లేకున్నా.. ఈ ఇద్దరు ఆటగాళ్లు మాత్రం ప్రాక్టీసు విషయంలో రాజీపడటం లేదన్నమాట.