F1 Race: ఆధునిక ఈవెంట్స్, క్రీడల్లో సౌదీ అరేబియా ఎంట్రీ ఇస్తోంది. కొత్తగా ఫార్ములా వన్ రేసులో ప్రవేశించింది. ఎఫ్ 1 రేసు క్యాలెండర్‌లో సౌదీ అరేబియాను చేర్చారు ఎఫ్ 1 నిర్వహకులు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


పాశ్యాత్త్య దేశాలకే పరిమితమైన ఫార్ములా వన్ రేసు ( Formula 1 Race ) లో సౌదీ అరేబియా ప్రవేశించింది. దాంతో వచ్చే ఏడాది జరగనున్న ఎఫ్1 సీజన్‌లో సౌదీ అరేబియాలోని జిద్దా నగరాన్ని చేర్చారు ఎఫ్1 నిర్వాహకులు.  సౌదీ ఆటోమొబైల్, మోటార్ సైకిల్ సమాఖ్యతో  ఒప్పందం కూడా జరిగింది.


ఫార్ములా వన్ రేసులో ప్రవేశించిన సౌదీ అరేబియా( Saudi Arabia ) జిద్దా ( Jiddah ) నగర శివార్లలోని కార్నిక్ సమీపంలో స్ట్రీట్ ట్రాక్ ( Street track ) నిర్మించింది కొత్తగా. 2021 నవంబర్ జరిగే రేసును ఈ ట్రాక్‌పై నిర్వహించనున్నట్టు ఎఫ్1 తెలిపింది. ఎర్ర సముద్రానికి ( Red Sea ) సమాంతరంగా ఉండే ఈ ట్రాక్..అందర్నీ ఆకట్టుకుంటూ కనువిందు చేస్తుందని ఎఫ్1 సమాఖ్య వెల్లడించింది.


అటు సౌదీ తీసుకున్న నిర్ణయాన్ని ఎఫ్1 ( F1 ) ఆహ్వానించింది. గల్ఫ్ దేశాల్లో బహ్రెయిన్, అబుదాబిలు ఇప్పటికే ఎఫ్1 సీజన్‌లకు ఆతిధ్యమిస్తున్నాయి. సౌదీ  రాజధాని రియాద్‌లో 2030 నాటికి ఫార్ములా వన్ రేసు నిర్వహించేలా ట్రాక్ కూడా నిర్మిస్తున్నారు. సౌదీలో ఉండే అధిక ఉష్ణోగ్రతల్ని దృష్టిలో ఉంచుకుని రాత్రిపూట రేసు నిర్వహించే ప్రతిపాదన ఉంది.


Also read: AUS v IND 2nd Test Highlights: ఆస్ట్రేలియా జట్టుకు డబుల్ షాకిచ్చిన ICC