AUS v IND 2nd Test Highlights: ఆస్ట్రేలియా జట్టుకు డబుల్ షాకిచ్చిన ICC

AUS v IND 2nd Test Highlights: ఆస్ట్రేలియా గడ్డపై తొలిటెస్టులో ఎదురైన పరాభవానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. అడిలైడ్ టెస్టులో 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైన భారత క్రికెట్ జట్టు.. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టులో నాలుగో రోజే ఆట ముగించింది.

Written by - Shankar Dukanam | Last Updated : Dec 29, 2020, 04:25 PM IST
  • తొలి టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న భారత జట్టు
  • మెల్‌బోర్న్ టెస్టులో 8 వికెట్ల తేడాతో టీమిండియా విజయకేతనం
  • ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుపై 2 నిర్ణయాలు తీసుకున్న ఐసీసీ
AUS v IND 2nd Test Highlights: ఆస్ట్రేలియా జట్టుకు డబుల్ షాకిచ్చిన ICC

AUS v IND 2nd Test Highlights:  ఆస్ట్రేలియా గడ్డపై తొలిటెస్టులో ఎదురైన పరాభవానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. అడిలైడ్ టెస్టులో 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైన భారత క్రికెట్ జట్టు.. మెల్‌బోర్న్ వేదికగా జరిగిన రెండో టెస్టులో నాలుగో రోజే ఆట ముగించింది. 8 వికెట్ల తేడాతో అజింక్య రహానే కెప్టెన్సీలో భారత జట్టు విజయదుందుబి మోగించింది. తద్వారా ప్రస్తుతానికి సిరీస్ 1-1తో సమమైంది.

అయితే భారత (Team India)జట్టు చేతిలో ఓటమిపాలైన ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుకు మరో షాక్ తగిలింది. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఆస్ట్రేలియా క్రికెటర్లకు భారీ జరిమానా విధించింది. ఆసీస్ క్రికెటర్ల మ్యాచ్ ఫీజులో 40శాతం కోత విధించింది. అంతటితో ఆగకుండా ఆసీస్ జట్టుకు మరింత నష్టాన్ని చేకూర్చే కఠిన నిర్ణయాన్ని తీసుకుంది. 

Also Read: ​India Vs Australia: ఆసీస్‌పై భారత్ ఘన విజయం

 

 

ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లలో సైతం కోత విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 4 పాయింట్లను కోత విధిస్తూ ICC నిర్ణయం తీసుకుంది. రెండో టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానాతో పాటు ఐసీసీ టెస్టు పాయింట్లలో కోత విధించినట్లు తెలుపుతూ ట్వీట్ చేసింది.

Also Read: MS Dhoniకి అత్యంత అరుదైన పురస్కారం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G  

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News