దక్షిణ కొరియాలోని చాంగౌన్‌లో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ సౌరభ్ చౌదరీ గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్స్‌ విభాగంలో 245.5 పాయింట్ల అత్యుత్తమ స్కోర్‌తో షూటర్ సౌరభ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడమే కాకుండా వరల్డ్ రికార్డు నెలకొల్పడం విశేషం. ఇదివరకు తన పేరిటే ఉన్న ప్రపంచ రికార్డుని తానే అధిగమించిన సౌరభ్ చౌదరికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. గోల్డ్ మెడల్ గెలిచిన సౌరభ్‌ చౌదరిని కేంద్ర క్రీడల శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ అభినందించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"173697","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Saurabh Chaudhary bags Gold medal and Arjun Singh Cheema wins bronze at ISSF Junior World Championship","field_file_image_title_text[und][0][value]":"ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భారత షూటర్ సౌరభ్ చౌదరీ గోల్డ్ మెడల్, అర్జున్‌ సింగ్ చీమాకు కాంస్య పతకం"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Saurabh Chaudhary bags Gold medal and Arjun Singh Cheema wins bronze at ISSF Junior World Championship","field_file_image_title_text[und][0][value]":"ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భారత షూటర్ సౌరభ్ చౌదరీ గోల్డ్ మెడల్, అర్జున్‌ సింగ్ చీమాకు కాంస్య పతకం"}},"link_text":false,"attributes":{"alt":"Saurabh Chaudhary bags Gold medal and Arjun Singh Cheema wins bronze at ISSF Junior World Championship","title":"ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భారత షూటర్ సౌరభ్ చౌదరీ గోల్డ్ మెడల్, అర్జున్‌ సింగ్ చీమాకు కాంస్య పతకం","class":"media-element file-default","data-delta":"1"}}]]



 


ఇక ఇదే పోటీల్లో 10మీ ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో అర్జున్‌ సింగ్ చీమా కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. దీంతో "అర్జున్ హిట్స్ ది టార్గెట్" అంటూ అర్జున్ సింగ్‌ని సైతం ప్రశంసిస్తూ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ప్రత్యేకంగా మరో ట్వీట్ చేశారు.