దక్షిణాఫ్రికా పర్యటనకు సంబంధించి భారత జట్టు ఎంపికపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ మండిపడ్డారు. ముఖ్యంగా ధావన్, రోహిత్‌లను తీసుకోవడంపై ఆయన విమర్శించారు. వీరి ప్రదర్శన మెరుగ్గా లేదని రికార్డులు చెబుతున్నా.. రాహుల్, రహానే లాంటి టాలెంటెడ్ ప్లేయర్లను పక్కన పెట్టి వారిని తీసుకోవడంపై ఆయన ప్రశ్నలు సంధించారు. ‘‘రోహిత్‌, ధావన్‌లు బాగా ఆడగలరని కోహ్లి అనుకుంటున్నాడు. కనుక వారికి రెండో అవకాశం కూడా దక్కవచ్చు. అయితే తొలి టెస్టులో టాప్‌ ఆర్డర్ ఎందుకు పూర్తిగా విఫలమైంది అన్న విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. రహానే లాంటి ఆటగాడిని టీమ్‌లోకి తీసుకుంటే పరిస్థితిలో మార్పు వస్తుందని అనుకుంటున్నాను’’ అని ఈ సందర్భంగా సౌరభ్ గంగూలీ తెలిపారు. సెలెక్టర్లు కూడా ఆటగాళ్ళ ఫామ్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని.. మంచి ఫామ్‌లో ఉండే ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు.