IPL 13 Schedule: ఐపీఎల్ 2020 షెడ్యూల్ ఖరారు.. తొలి, చివరి మ్యాచ్ వారిదే!
ఐపీఎల్ సీజన్ 13 షెడ్యూలు అధికారికంగా విడుదలైంది. ఐపీఎల్ నిర్వాహకులు మంగళవారం ఐపీఎల్ 2020 షెడ్యూలను ట్వీట్ చేశారు.
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అభిమానులకు శుభవార్త వచ్చేసింది. ఐపీఎల్ 13వ సీజన్ షెడ్యూలు ఎట్టకేలకు ఖరారైంది. ఇటీవల లీకులు వచ్చినా, అధికారికంగా మాత్రం ఐపీఎల్ షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. ఐపీఎల్ 2020 లీగ్ షెడ్యూలును నిర్వాహకులు అధికారిక ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. వీవో ఐపీఎల్ 2020 లీగ్ షెడ్యూలు అని ట్వీట్ చేశారు. మార్చి 29న తాజా సీజన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
Also Read: ఐపీఎల్ ఫైనల్‌ను తలపించే తొలి పోరు!
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా తొలి పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (MI)తో మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ (CSK) తలపడనుంది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ 13వ సీజన్ ఆరంభం కానున్నట్లు అధికారిక ట్విట్టర్‌లో స్పష్టం చేశారు. ఈ సీజన్‌లో రెండు మ్యాచ్‌లు కేవలం ఆదివారాల్లోనే నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ఇదివరకే నిర్ణయించారు. లీగ్ దశలో చివరి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ముంబై ఇండియన్స్ (MI) జట్ల మధ్య జరగనుంది. మే 17న బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్ నిర్వహిస్తారు. లీగ్ దశలో మొత్తం 56 మ్యాచ్‌లుంటాయి.
Also Read: సన్ రైజర్స్ హైదరాబాద్ IPL 2020 షెడ్యూల్.. SRH తొలి మ్యాచ్ ఎవరితో!
కాగా, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో ఆడనుంది.ఏప్రిల్ 1న హైదరాబాద్ లోని ఉప్పల్ స్డేడియంలో రాత్రి 8 గంటలకు ముంబై, సన్ రైజర్స్ మ్యాచ్ జరగనుంది. తమ రెండో మ్యాచ్‌లో సన్ రైజర్స్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో తలపడనుంది. ఏప్రిల్ 4న మొహాలీ వేదికగా ఈ మ్యాచ్ నిర్వహిస్తారు.
Also Read: ఆర్సీబీ ఐపీఎల్ 2020 మ్యాచ్‌ల షెడ్యూలు
[[{"fid":"182145","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Photos Courtesy: Twitter/IndianPremierLeague","field_file_image_title_text[und][0][value]":"ఐపీఎల్ 2020 మ్యాచ్‌ల షెడ్యూలు"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Photos Courtesy: Twitter/IndianPremierLeague","field_file_image_title_text[und][0][value]":"ఐపీఎల్ 2020 మ్యాచ్‌ల షెడ్యూలు"}},"link_text":false,"attributes":{"alt":"Photos Courtesy: Twitter/IndianPremierLeague","title":"ఐపీఎల్ 2020 మ్యాచ్‌ల షెడ్యూలు","class":"media-element file-default","data-delta":"1"}}]]
[[{"fid":"182146","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Photos Courtesy: Twitter/IndianPremierLeague","field_file_image_title_text[und][0][value]":"ఐపీఎల్ 2020 మ్యాచ్‌ల షెడ్యూలు"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Photos Courtesy: Twitter/IndianPremierLeague","field_file_image_title_text[und][0][value]":"ఐపీఎల్ 2020 మ్యాచ్‌ల షెడ్యూలు"}},"link_text":false,"attributes":{"alt":"Photos Courtesy: Twitter/IndianPremierLeague","title":"ఐపీఎల్ 2020 మ్యాచ్‌ల షెడ్యూలు","class":"media-element file-default","data-delta":"2"}}]]
(Photos Courtesy: Twitter/IndianPremierLeague)