Shaheen Afridi Marriage: షాహిద్ ఆఫ్రీది కుమార్తెను పెళ్లి చేసుకున్న పాక్ స్టార్ పేసర్.. వైరల్ పిక్స్!
Shaheen Afridi married former Pakistan Ex Captain Shahid Afridi daughter Ansha. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది రెండో కుమార్తె అన్షాను షాహీన్ అఫ్రిది పెళ్లి చేసుకున్నాడు.
Pakistan Pacer Shaheen Shah Afridi Marries Shahid Afridi Daughter Ansha in Karachi: పాకిస్థాన్ స్టార్ పేస్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది ఓ ఇంటివద్దయ్యాడు. పాకిస్థాన్ మాజీ కెప్టెన్, పీసీబీ చీఫ్ సెలక్టర్ షాహిద్ ఆఫ్రీది రెండో కుమార్తె అన్షాను షాహీన్ పెళ్లి చేసుకున్నాడు. షాహీన్, అన్షా వివాహం శుక్రవారం కరాచీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకి షాహిద్, షాహీన్ బంధువులు, అత్యంత సన్నిహితులు హాజరయ్యారు. గతేడాది డిసెంబర్ 30న షాహిద్ ఆఫ్రీది పెద్ద కుమార్తె అక్సా షాహిద్ ఆఫ్రీది పెళ్లి జరిగిన విషయం తెలిసిందే.
షాహీన్ షా అఫ్రిది, అన్షా ఆఫ్రీది వివాహానికి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో పాటు అనేక మంది క్రికెటర్లు హాజరయ్యారు. సర్ఫరాజ్ ఖాన్, షాదాబ్ ఖాన్, ఫఖర్ జమాన్, నసీమ్ షాలు ఈ పెళ్లికి హాజరయ్యారు. ఇందుకు సంబందించిన ఫొటోస్, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లాహోర్ క్వలాండర్స్ జట్టు షాహీన్ షా అఫ్రిది పెళ్లికి సంబంధించిన ఫోటోలను ట్వీట్ చేసింది. గత ఏడాదే అన్షాతో షాహీన్ ఎంగేజ్మెంట్ జరిగింది.
ప్రస్తుతం మోకాలి గాయం కారణంగా షహీన్ అఫ్రిది క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆసియా కప్ 2022 సమయంలో మోకాలి గాయంతో టోర్నీలో ఆడలేదు. 2022 టీ20 ప్రపంచకప్ నాటికి కోలుకున్నాడు. మెగా టోర్నీలో పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోయినా.. అంచనాల మేర రాణించాడు. అయితే టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో షహీన్ అఫ్రిదికి గాయం తిరగబెట్టింది. దీంతో మరోసారి అతడు జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం క్రికెట్‌కు దూరంగా ఉండి కోలుకుంటున్న షహీన్ అఫ్రిది.. శుక్రవారం (ఫిబ్రవరి 3) పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రీది కుమార్తె అన్షాను పెళ్లి చేసుకున్నాడు.
22 ఏళ్ల షాహీన్ షా అఫ్రిది 2018లో పాకిస్తాన్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 25 టెస్టులు, 32 వన్డేలు, 47 టీ20లు ఆడాడు. షాహీన్ వరుసగా 99, 62, 58 వికెట్స్ పడగొట్టాడు. మరోవైపు షాహిద్ ఆఫ్రీది పాక్ తరపున 27 టెస్టులు, 398 వన్డేలు, 99 టీ20లు ఆడాడు. గతేడాది చివరలో పీసీబీ చీఫ్ సెలక్టర్‌గా ఎన్నికయ్యాడు. షాహిద్ ఆఫ్రీదికి నలుగురు కూతుళ్లు ఉన్న విషయం తెలిసిందే. కుమారుడు అందరికంటే చిన్నవాడు.
Also Read: AC Price Down: వేసవి ప్రారంభానికి ముందు శుభవార్త.. సగానికి తగ్గిన ఏసీ ధరలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.