IPL 2021: ప్రాక్టీస్ వీడియో పోస్ట్ చేసిన కోహ్లీ... కన్నుల పండగ్గా ఉందన్న ఆఫ్రిది
ఈ రోజు జరగబోయే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు Vs సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కోసం విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది పొగుడుతూ ట్వీట్ చేసారు. అదేంటో మీరే చూడండి.
IPL 2021: ఐపీఎల్ (IPL) రెండో దశలో భాగంగా ఈ రోజు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో (SRH) తలపడనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్ కు చేరిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో సన్‌రైజర్స్ పై విజయం సాధించి, పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానాన్ని గెలుచుకోవాలని పట్టుదలతో ఉంది.
గతేడాది జరిగిన ఐపీఎల్ సీజన్ (IPL 2020) లో ప్లే ఆఫ్ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ ను ఓడించే టైటిల్ ను గెలవకుండా అడ్డుకట్ట వేసిన సంగతి మన అందరికి తెలిసిందే. ఈ సారి ఎలాగైనా హైదరాబాద్‌ను ఓడించి పగ తీర్చుకోవాలని కోహ్లి సేన భావిస్తుంది.
Also Read: Navratri 2021: దేవీ నవరాత్రుల ఉపవాసంలో పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి
ఎలాగైన మ్యాచ్ గెలవాలన్న పట్టుదలతో ఉన్న రాయల్ చాలెంజర్స్ ప్రాక్టీసులు నిమగ్మమై ఉన్నారు. ఇప్పటి వరకు ఐపీఎల్ 2021 (IPL 2021) లో 12 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 357 రన్స్ చేసాడు.
దీనిలో భాగంగా కోహ్లీ (VIrat Kohli) ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసాడు. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi) తనడైన శైలిలో ట్విట్టర్ వేదికగా స్పందించారు. కోహ్లీ పోస్ట్ చేసిన వీడియోని షేర్ చేస్తూ, "గొప్ప ఆటగాడు ప్రాక్టీస్ ఎల్లపుడు 100 శాతం ఇవ్వటానికే ప్రయత్నిస్తాడు - చూడటానికి కన్నుల పండుగగా ఉంది" అని పోస్ట్ చేసాడు. దీనికి నేటిజన్లు ఎవరికి వారు నచ్చిన విధంగా స్పందిస్తున్నారు.
Also Read: MAA Elecrtions 2021: ప్రకాష్ రాజ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన నటుడు రవి బాబు
విరాట్ పోస్ట్ చేసిన ఈ ట్వీట్ కు 56 వేలకు పైగా వ్యూస్ రాగా.. 5 వేలకు పైగా రీ ట్వీట్స్ వచ్చాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి