ks bharat: ప్రస్తుత ఐపీఎల్(IPL 2021 Second Phase)లో ఆర్సీబీ వికెట్‌కీపర్‌గా రాణిస్తున్న భరత్.. నిన్న రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)తో జరిగిన మ్యాచ్‌లో సంయమనంతో బ్యాటింగ్ చేసి 35 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్ సాయంతో 44 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చిన తీరును మ్యాక్సీ(Maxwell)తో పాటు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి(Virat Kohli) సైతం కొనియాడారు. భరత్ అసలు సిసలైన టాప్ క్లాస్ బ్యాటర్ అని వీరు కితాబునిచ్చారు. భరత్ బ్యాటింగ్‌లో చాలా వేరియేషన్స్ ఉన్నాయని, అవి పొట్టి క్రికెట్‌లో చాలా ఉపయోగకరమని పేర్కొన్నారు.
భరత్.. బ్యాటర్‌గానే కాకుండా వికెట్‌కీపర్‌గా కూడా అద్భుతంగా రాణిస్తున్నాడని, భవిష్యత్తులో టీమిండియా(Teamindia)లో కచ్చితంగా చోటు దక్కించుకుంటాడని అశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా, నిన్న ఆర్‌ఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో భరత్ సహా మ్యాక్స్‌వెల్(30 బంతుల్లో 50 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్), పడిక్కల్(17 బంతుల్లో 22; 4 ఫోర్లు), కోహ్లి(20 బంతుల్లో 25; 4 ఫోర్లు) రాణించడంతో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కేఎస్ భరత్ బ్యాటింగ్‌తో పాటు కీపింగ్(క్యాచ్, స్టంప్ అవుట్) లోనూ రాణించాడు. భరత్‌ను ఈ ఏడాది ఐపీఎల్‌కు ముందే ఆర్సీబీ 20 లక్షల బేస్ ప్రైస్‌కు దక్కించుకుంది.
Also Read: RR Vs RCB: ముస్తాఫిజుర్ రెహ్మాన్ సూపర్ ఫీల్డింగ్...వైరల్ అవుతున్న వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook