Abu Dhabi Knight Riders: విదేశీ ఫ్రాంచైజీల కొనుగోలులో షారుక్ ఖాన్, అబుదాబి నైట్‌రైడర్స్.. కేకేఆర్ హస్తగతం
Abu Dhabi Knight Riders: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ మరో క్రికెట్ ఫ్రాంచైజీని దక్కించుకున్నాడు. యూఏఈ వేదికగా జరగనున్న టీ20 లీగ్‌లో అబు దాబి నైట్‌రైడర్స్..కేకేఆర్ వశమైంది.
Abu Dhabi Knight Riders: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ మరో క్రికెట్ ఫ్రాంచైజీని దక్కించుకున్నాడు. యూఏఈ వేదికగా జరగనున్న టీ20 లీగ్‌లో అబు దాబి నైట్‌రైడర్స్..కేకేఆర్ వశమైంది.
ఇండియాలో జరుగుతున్న ఐపీఎల్ టీ20 టోర్నమెంట్‌కు ఉన్న క్రేజ్ తెలిసిందే. ఐపీఎల్ స్పూర్థిగా వివిధ దేశాల్లో టీ20 లీగ్స్ చాలా జరుగుతున్నాయి. ఐపీఎల్ టీ20 లో ప్రస్తుతం 10 ఫ్రాంచైజీలున్నాయి. ఇందులో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఒకటి. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, బాలీవుడ్ నటి జూహీ చావ్లాలకు చెందిన సైట్ రైడర్స్ గ్రూప్ 2008లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఆ తరువాత 2015లో వెస్ట్‌ఇండీస్ వేదికగా జరిగిన కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్బాగో నైట్‌రైడర్స్ జట్టును సొంతం చేసుకుంది. ఇప్పుడు తాజాగా యూఏఈ వేదికగా జరగాల్సిన టీ20 లీగ్‌కు సంబంధించి అబుదాబి నైట్‌రైడర్స్‌ను దక్కించుకుంది. ఈ విషయాన్ని స్వయంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ ట్వీట్ ద్వారా వెల్లడించింది. యూఏఈ టీ20 లీగ్‌గా జరిగే ఎమిరేట్స్ క్రికెట్‌లో ఈ కొత్త ఫ్రాంచైజీ భాగం కానుంది. కొత్త జట్టును స్థూలంగా ఏడీకేఆర్ అని పిలుస్తారు.
యూఎస్‌లోని ఐర్విన్ నగరంలో పదివేల సిటింగ్ సామర్ద్యంతో భారీ క్రికెట్ స్డేడియం నిర్మితం కానుంది. త్వరలో ఇక్కడ మేజర్ లీగ్ క్రికెట్ ఎంఎల్సీ ప్రారంభం కానుంది. ఈ లీగ్ టోర్నీలో కూడా ఒక ఫ్రాంచైజీను కేకేఆర్ గ్రూప్ దక్కించుకోనుందని తెలుస్తోంది.కేకేఆర్ ఒక్కటే కాకుండా..ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కూడా యూఎస్‌లో మరో ఫ్రాంచైజీని కొనుగోలు చేసిందని తెలుస్తోంది.
Also read: Team India: టీ20 ప్రపంచకప్ 2022 కోసం ఆ అభిమాని ఎంపిక చేసిన టీమ్ ఇండియా జట్టు ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook