Shakib Al Hasan Injury: బంగ్లాదేశ్ ఆల్​రౌండర్ షకిబ్ అల్ హసన్ (Shakib Al Hasan News) టీ20 ప్రపంచకప్​ టోర్నీకి దూరమయ్యాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్​కు ముందే హసన్​కు గాయం కావడం బంగ్లా జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది. అయితే.. తొడ కండరాల్లో స్వల్ప చీలిక ఏర్పడిన కారణంగా షకిబ్ టోర్నీకి (T20 World Cup 2021) దూరమైనట్లు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"షకిబ్​కు తొడకండరాల్లో గాయమైంది. ఎలాంటి​ గాయమనేది స్కానింగ్ రిపోర్ట్స్​ వచ్చాక తెలుస్తోంది. ప్రస్తుతం టోర్నీ నుంచి అతడు తప్పుకుంటున్నాడు" అని బంగ్లాదేశ్ క్రికెట్ వర్గాలు తెలిపాయి.


టీ20 ప్రపంచకప్ సూపర్​ 12 పోటీల్లో బంగ్లాదేశ్​ మూడు మ్యాచ్​లు ఆడింది. ఒక్క మ్యాచ్​లోనూ విజయం సాధించలేదు. అయితే.. గాయం కారణంగా షకిబ్ దూరమవడం బంగ్లా జట్టుకు తీరని లోటు ఏర్పడనుంది. ఇటీవలే ఆ జట్టుకు చెందిన మహమ్మద్ సైఫుద్దీన్ నడుం నొప్పి (Mohammad Saifuddin Injury) కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. అతడి స్థానంలో రుబెల్ (Rubel Hossain News) జట్టులోకి వచ్చాడు. ప్రస్తుతం షకిబ్​ స్థానంలో ఎవరు ఆడుతారనేది తెలియాల్సి ఉంది.  


Also Read: National Sports Awards: నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్.. విజేతలకు నవంబరు 1న ప్రదానోత్సవం  


Also Read: Afghanistan Vs Namibia: సెమీస్ రేసులో నిలిచిన అఫ్గానిస్థాన్.. నమీబియాపై ఘన విజయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook