National Sports Awards: నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్.. విజేతలకు నవంబరు 1న ప్రదానోత్సవం

National Sports Awards: మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్‌రత్న అవార్డుకు 11 మంది క్రీడాకారుల పేర్లను జాతీయ క్రీడా అవార్డుల కమిటీ బుధవారం నామినేట్‌ చేసింది. అర్జున అవార్డుకు 35 మంది అథ్లెట్ల పేర్లను ఎంపిక చేశారు. ఈ అవార్డుల ప్రదానోత్సవాన్ని సోమవారం (నవంబరు 1) ఢిల్లీలో నిర్వహించనున్నట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 31, 2021, 01:27 PM IST
    • జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవంపై క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటన
    • నవంబరు 1న ఢిల్లీలో నిర్వహిస్తామని వెల్లడి
    • ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా విజేతు పురస్కారాలు అందుకునే అవకాశం
National Sports Awards: నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్.. విజేతలకు నవంబరు 1న ప్రదానోత్సవం

National Sports Awards: గత ఏడాదికి సంబంధించిన క్రీడా పురస్కారాల ప్రదానోత్సవాన్ని సోమవారం (నవంబరు 1) ఢిల్లీలో నిర్వహించనున్నట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది. 2020లో అవార్డుకు ఎంపికైన ఆటగాళ్లకు నగదు బహుమతి లభించినా కొవిడ్‌ కారణంగా అవార్డులను కేంద్ర అందించలేకపోయింది.

దాంతో ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలోని ఓ హోటల్‌లో రేపు నిర్వహించి వారికి ప్రత్యక్షంగా అవార్డులు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ ఏటా క్రీడా దినోత్సవమైన ఆగస్టు 29న అవార్డులు ఇవ్వడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే కరోనా ఆంక్షలతో పాటు ఒలింపిక్స్ విజేతల కోసం ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని ప్రధానమంత్రి ఇదివరకే నిర్ణయించారు.

భారత అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న-2021 (Khel Ratna Award-2021) అవార్డుకు ఈసారి 11 మంది ఎంపికవ్వగా.. అర్జున అవార్డు (Arjuna Awards)కు 35 మంది అథ్లెట్ల పేర్లను జాతీయ క్రీడా అవార్డుల కమిటీ నామినేట్‌ చేసింది. ఖేల్‌రత్న అవార్డుకు టోక్యో ఒలింపిక్స్‌ ఛాంపియన్‌ జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా (Neeraj Chopra), భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ (Mithali Raj), ఫుట్‌బాల్ క్రీడాకారుడు సునీల్ ఛెత్రీ ఎంపిక అయ్యారు.

మరోవైపు టీమ్ఇండియా క్రికెటర్‌ శిఖర్‌ ధావన్ (Shikhar Dhawan), టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి భవీనా పటేల్‌ తదితరులు అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. ఏటా జులై - ఆగస్టులో ఈ జాతీయ అవార్డుల ప్రదానం ఉండగా.. టోక్యో ఒలింపిక్స్‌ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. కాగా, గ‌తంలో రాజీవ్‌గాంధీ ఖేల్‌ర‌త్నపేరుతో ఉన్న ఖేల్‌రత్న అవార్డును ఇటీవ‌లే మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌ర‌త్న అవార్డుగా మార్చిన సంగతి తెలిసిందే. 

ఖేల్‌ రత్న అవార్డు 2021 
* నీరజ్ చోప్రా (అథ్లెటిక్స్)
* రవి దహియా (రెజ్లింగ్)
* పీఆర్‌ శ్రీజేష్ (హాకీ)
* లవ్లీనా బొర్గోహైన్‌ (బాక్సింగ్)
* సునీల్ ఛెత్రీ (ఫుట్‌బాల్)
* మిథాలీ రాజ్ (క్రికెట్)
* ప్రమోద్ భగత్ (బ్యాడ్మింటన్)
* సుమిత్ అంటిల్ (అథ్లెటిక్స్)
* అవని ​​లేఖరా (షూటింగ్)
* కృష్ణ నాగర్ (బ్యాడ్మింటన్)
* మనీష్ నర్వాల్ (షూటింగ్)

అర్జున అవార్డ్‌ 2021
* నిషద్ కుమార్ (హైజంప్)
* ప్రవీణ్ కుమార్ (హైజంప్)
* శరద్ కుమార్ (హైజంప్)
* యోగేష్ కథునియా (డిస్కస్ త్రో)
* సుహాస్ LY (బ్యాడ్మింటన్)
* సింగ్‌రాజ్ అధానా (షూటింగ్)
* భవినా పటేల్ (టేబుల్ టెన్నిస్)
* హర్విందర్ సింగ్ (ఆర్చరీ)
* శిఖర్ ధావన్ (క్రికెట్)

Also Read: Khel Ratna Award: నీరజ్, మిథాలీ సహా 11 మందికి ఖేల్ రత్న..ధావన్‌కు అర్జున అవార్డు!

Also Read: IND Vs NZ Match Prediction: ఇండియా Vs న్యూజిలాండ్ మ్యాచ్.. కీలక మ్యాచ్లో నిలిచేదెవరు? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x