Shikhar Dhawan: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి భారీ షాకిచ్చిన గబ్బర్.. రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్ వీడియో వైరల్..
Shikhar Dhawan Retirement Video: మాజీ ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. ఆయన చివరగా 2022 భారత్‌లో జరిగిన బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఆడారు. అయితే, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తన రిటైర్మెంట్‌ను ప్రకటిస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు ఈ 38 ఏళ్ల మాజీ క్రికెటర్.
Shikhar Dhawan Retirement Video: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన గబ్బర్.. తాను దేశీ అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌కు రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు శిఖర్ ధావన్ ప్రకటించారు. నాకు జ్ఞాపకాలు ఎన్నో అందించిన అభిమానుకులకు థ్యాంక్స్ అంటూ ఓ వీడియో ఈరోజు విడుదల చేశారు. ఇది భారత క్రికెట్ అభిమానులకు బిగ్ షాక్..
మాజీ ఇండియన్ క్రికెటర్ శిఖర్ ధావన్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. ఆయన చివరగా 2022 భారత్‌లో జరిగిన బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ఆడారు. అయితే, సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తన రిటైర్మెంట్‌ను ప్రకటిస్తూ ఓ వీడియోను విడుదల చేశాడు ఈ 38 ఏళ్ల మాజీ క్రికెటర్. అంతేకాదు మీరు అందించిన లవ్ సపోర్ట్‌కు థ్యాంక్స్ అంటూ తన క్రికెట్ అభిమానులను ఉద్దేశించి చెప్పారు. ధావన్ ఢిల్లీలో జన్మించారు. ఈయన మొదటగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టింది మన విశాఖపట్టణంలోనే.. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ మ్యాచ్‌లో అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేక పోయారు డకౌట్‌తో వెనుదిరిగారు. మొదట తన కెరీర్‌లో ఎన్నో ఫెయిల్యూర్స్ చూసిన ధావన్ 2013 నుంచి క్రికెట్ మూడు ఫార్మాట్లలో అత్యంత ప్రతిభను కనబరిచారు.
ఇదీ చదవండి: ఉక్రెయిన్‌కు భీష్మ క్యూబ్‌ను బహుమతిగా ఇచ్చిన ప్రధాని మోడీ...దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
'నాకు మన ఇండియా తరఫున క్రికెట్ ఆడాలనే లక్ష్యం ఎప్పటి నుంచో ఉండేది. ప్రస్తుతం ఆ కల నెరవేరింది అందరికీ థ్యాంక్స్. ముఖ్యంగా నా కుటుంబ సభ్యులు, చిన్నప్పటి నుంచి క్రికెట్ నేర్పిస్తున్న క్రికెట్ కోచ్ తారక్ సిన్హా, మదన్ శర్మలకు వారి గైడెన్స్‌లోనే నేను క్రికెట్ నేర్చుకున్నాను. ఇన్ని ఏళ్లుగా నేను ఆడిన క్రికెట్ టీమ్‌కు కూడా థ్యాంక్స్ అది కూడా నా క్రికెట్ ఫ్యామిలీ నాపై చూపిన లవ్, సపోర్ట్‌కు థ్యాంక్స్ అంటూ జాతీయ, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ధావన్ ఓ వీడియో విడుదల చేశారు.
ఇదీ చదవండి: తెల్ల జుట్టుకు సహజసిద్ధంగా చెక్ పెట్టే జ్యూసులు.. వీటి మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?
ముఖ్యంగా తనకు అవకాశం కల్పించిన బీసీసీఐ (Board Of Control For Cricket In Inda) నాకు ఇండియా తరఫున క్రికెట్ ఆడే అద్భుత అవకాశాన్ని కల్పించారు అని చెప్పుకోచ్చారు. డీడీసీఏ (Delhi & District Cricket Association) కు కూడా ధన్యవాదాలు అన్నారు.
శిఖర్ దావన్ టెస్ట్ కెరీర్‌తో తన ప్రస్థానాన్ని 2013 మార్చి 16 న ప్రారంభించారు. టెస్టుల్లో ఫాస్టేస్ట్ సెంచరీ కేవలం 85 బంతుల్లో చేసిన రికార్డు నెలకొల్పారు. 2013- 2017 ఆయన కనబర్చిన ప్రతిభకు గోల్డెన్ బ్యాట్ కూడా దక్కింది. శిఖర్‌కు ఒక నిక్ నేమ్ కూడా ఉంది. అదే 'మిస్టర్ ఐసీసీ' ఐసీసీ టోర్నమెంటుల్లో ఆయన కనబర్చిన అద్భుతమైన ఆటకు ఈ పేరు దక్కింది. 2015 వరల్డ్ కప్‌లో అత్యధిక స్కోరు చేశారు. భారత్ తరఫున 167 మ్యాచులు ఆడిన ధావన్ 6793 రన్స్ చేశారు. యావరేజ్ 44.11, స్ట్రైక్ రేట్ 91.35. ఏడు సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు కూడా చేశారు.
అంతేకాదు శిఖర్ ధావన్ 68 టీ20 మ్యాచ్‌లు ఆడ 1759 రన్స్ సాధించారు. యావరేజ్ 27.92 కాగా, స్ట్రైక్ రేట్ 126.36. ఇందులో 11 హాఫ్ సెంచరీలు కూడా చేశారు. మొత్తం 34 టెస్ట్ మ్యాచుల్లో ధావన్ 2315 రన్స్ చేశారు. యావరేజ్‌గ 40.61, ఇందులో ఏడు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలను నమోదు చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Facebook, Twitter