India vs Zimbabwe: వచ్చే నెల జింబాబ్వేకు టీమిండియా..కెప్టెన్, కోచ్ ఎవరో తెలుసా..?
India vs Zimbabwe: భారత క్రికెట్ జట్టు మరో టూర్‌కు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చక చక సాగుతున్నాయి. వచ్చే నెలలో జింబాబ్వే పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. టూర్‌కు ఎంపిక అయిన భారత క్రికెట్ జట్టు సభ్యులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..
India vs Zimbabwe: ఈఏడాది టీమిండియా బిజీ బిజీగా గడుపుతోంది. వరుసగా బెట్టి సిరీస్‌లు ఆడుతోంది. ఇప్పటికే ఇంగ్లండ్ టూర్‌లో ఉన్న భారత్ టీ20, వన్డే సిరీస్‌లను ఆడనుంది. ఇప్పటికే టీ20 సిరీస్ ప్రారంభమయ్యింది. మొదటి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. టీ20ల తర్వాత వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఆ వెంటనే విండీస్ టూర్ మొదలువుతుంది.
వెస్లిండీస్‌తో వన్డే సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు జింబాబ్వే వెళ్తుంది. ఆ దేశంతో మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది. ఆగస్టు 18న హారారే వేదికగా తొలి వన్డే మొదలవుతుంది. ఈమేరకు షెడ్యూల్ సైతం వచ్చేసింది. ఆ వెంటనే ఆగస్టు 27న శ్రీలంక వేదికగా ఆసియా కప్ మొదలవుతుంది. ఈక్రమంలో జింబాబ్వేకు భారత జూనియర్ జట్టు వెళ్లే అవకాశం ఉంది.
జింబాబ్వే టూర్‌కు రోహిత్ శర్మ, హెచ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ దూరం కానున్నారు. దీంతో జూనియర్ జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా, కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లకు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఈఏడాది టీ20 వరల్డ్ కప్ తమ టార్గెట్ అని బీసీసీఐ అధికారులు తెలిపారు. ఆ దిశగా జట్టును తయారు చేస్తున్నామని..కెప్టెన్లను సైతం మారుస్తున్నామన్నారు.
Also read:Ysrcp Plenary: రాబోయేది మన ప్రభుత్వమే..వైసీపీ అధ్యక్షుడిగా సీఎం జగన్ ఎన్నిక..!
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook