Shikhar Dhawan says Virat Kohli self belief is very strong: టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ శనివారం (నవంబర్ 5) 34వ పుట్టిన రోజును జరుపుకున్నాడు. కింగ్ కోహ్లీ బర్త్‌డే సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఫాన్స్, సహచర ఆటగాళ్లు, మాజీలు, ప్రముఖులు కోహ్లీ విషెష్ చెపుతూ.. అతడి సేవలను కొనియాడారు. దాంతో విరాట్ కోహ్లీ పేరు ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్‌ ధావన్‌.. విరాట్ కోహ్లీకి విషెష్ చెప్పి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ సక్సెస్‌కు కొన్ని ప్రత్యేక కారణాలున్నాయని గబ్బర్ తెలిపాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'నేడు పుట్టిన రోజు జరుపుకొంటున్న విరాట్‌ కోహ్లీకి నా శుభాకాంక్షలు. కోహ్లీ కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయి. మనం ఈ సమాజంలో ఓ మంచి స్నేహితుడిగా ఉంటామా లేదా శత్రువుగా ఉంటామా అనేది మనమీదే ఆధారపడి ఉంటుంది. కోహ్లీ ఆత్మవిశ్వాసం చాలా చాలా గొప్పది. విరాట్ ఎప్పుడూ సానుకూల దృక్పథంతోనే ఉంటాడు. అతడితో మాట్లాడితే.. మనతో మనం మాట్లాడుకున్నట్టుగానే ఉంటుంది. ప్రతి ఒక్కరితో ఎంతో క్రమశిక్షణతో మెలుగుతాడు. ఆటపట్ల ఎంతో నిబద్దత ఉంటుంది' అని శిఖర్‌ ధావన్‌ చెప్పాడు.


'విరాట్ కోహ్లీ కొంతకాలం అధిక బరువుతో సతమతమయ్యాడు. తన సంకల్ప బలంతో తనను తాను పూర్తిగా మార్చుకున్నాడు. ఫిట్‌నెస్‌, ఆట కోసం ఏదైనా చేస్తాడు. ఎప్పుడూ రన్స్ చేసి జట్టుకు విజయం అందించాలని కోహ్లీ తాపత్రయ పడతాడు. ఈ లక్షణాలన్నీ అతడి సక్సెస్‌కు కారణం. ప్రతి దశలో జీవితం మనకు ఎంతో నేర్పుతుంది. తిరిగి ఫామ్‌లోకి రావడానికి కోహ్లీ ఎంతో కష్టపడాల్సి వచ్చింది. ఇది క్రికెట్ ఆటలో సహజమే. విమర్శలను ఎదుర్కొని మరీ నిలబడ్డాడు. తన అవసరం జట్టుకు ఎంత ఉందో ఎన్నోసార్లు నిరూపించాడు' అని గబ్బర్ పేర్కొన్నాడు.


'మ్యాచ్‌లో తుది ఫలితం ఆధారంగా మైదానంలోని ఫాన్స్ భావోద్వేగాలు మారుతాయి. కానీ క్రికెటర్లకు అలా కాదు. ఏదేమైనా ప్లేయర్స్ తమపై నమ్మకాన్ని కోల్పోకూడదు. విమర్శలు ఎదురైనా కూడా వాటి ప్రభావం మనపై ఉండకుండా చూసుకోవాలి. విరాట్‌ కోహ్లీ అదే  చేశాడు. నాకు తెలిసి ఢిల్లీ ఆటగాళ్లలోనే ఏదో ప్రత్యేకత ఉంది. ఎక్కడాలేని తెగువ, సామర్థ్యం వారిలో ఉంటుంది. అందుకే క్రికెట్‌లో వారు ప్రత్యేకం. కోహ్లీ సూపర్' అంటూ శిఖర్‌ ధావన్‌ ప్రశంసించాడు. 


Also Read: మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. దక్షిణాఫ్రికాను ముంచిన వాన్ డెర్ మెర్వ్ (వీడియో)!


Also Read: Virat Kohli: టీ20 ప్రపంచకప్ 2022ను భారత్ గెలిస్తే.. పెద్ద కేక్ కట్‌ చేస్తా: విరాట్‌ కోహ్లీ  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి