Shikhar Dhawan reveals the reason why Sanju Samson missed out IND vs NZ 2nd ODI: భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఆదివారం రెండో వన్డే మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. భారత్ ఇన్నింగ్స్‌ 12.5 ఓవర్ల వద్ద భారీగా వర్షం కురవడంతో మ్యాచ్‌ రద్దైయింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక బుధవారం చివరిదైన మూడో మ్యాచ్‌ జరగనుంది. అయితే రెండో వన్డేలో వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై సోషల్‌ మీడియాలో అభిమానులు మండిపడ్డారు. ఈ విషయంపై మ్యాచ్‌ అనంతరం భారత తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్‌ ఓ క్లారిటీ ఇచ్చాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మ్యాచ్‌ అనంతరం శిఖర్ ధావన్‌ మాట్లాడుతూ... 'మ్యాచ్‌ వర్షం కారణంగా ఆగిపోయింది. అన్నీ మన నియంత్రణలో ఉండవు. కొన్నిసార్లు ఇలా జరుగుతుంటుంది. ఇక చివరి వన్డేపై దృష్టిసారిస్తాం. గెలవడానికి బరిలోకి దిగుతాం. పిచ్‌ మాత్రం కాస్త బ్యాటింగ్‌కు అనుకూలంగా అనిపించింది. ఇన్నింగ్స్ ఆరంభంలో బంతి స్వింగ్ అయింది. నేను ఎక్కువగా పరుగులు చేయలేదు. శుభ్‌మన్‌ గిల్‌ అద్భుతంగా ఆడాడు. అలానే సూర్యకుమార్ యాదవ్ కూడా' అని అన్నాడు. 



'మేము ఆరో బౌలర్‌ ఆప్షన్‌ ఉంటే బాగుంటుందని భావించాం. అందుకే సంజూ శాంసన్‌ బదులు ఆల్‌రౌండర్‌ దీపక్ హుడాను తుది జట్టులోకి తీసుకొన్నాం. అలాగే దీపక్ చహర్‌ వికెట్‌కు రెండు వైపులా బంతిని స్వింగ్‌ చేయగడు. అందుకే అతడిని తుది జట్టులోకి ఎంపిక చేశాం. మా జట్టులో చాలా మంది విశ్రాంతి తీసుకుంటున్నారు. అయినప్పటికీ భారత జట్టు చాలా బలంగా ఉంది. మా స్క్వాడ్‌ ఆటతీరును పరిశీలిస్తే తెలిసిపోతుంది. జట్టును నడిపించడం ఎప్పుడూ గర్వకారణమే. నేను చాలా యంగ్ అన్నట్లుగా అనిపించింది. మా యువ ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. కొందరికి  ఇది మంచి అవకాశం. క్రైస్ట్‌చర్చ్‌లో విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది' అని శిఖర్ ధావన్‌ చెప్పాడు. 


Also Read: Saturday Remedies: శనివారం నాడు ఈ వస్తువులను ఉచితంగా కూడా తీసుకోకండి.. తీసుకున్నారో అంతే సంగతులు!


Also Read: Sanju Samson: సౌత్‌ ప్లేయర్ అని వివక్ష.. రిషబ్ పంత్ కోసం సంజూ శాంసన్‌ కెరీర్ నాశనం చేసిన బీసీసీఐ!  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.