Shikhar Dhawan funny video: బట్టలు ఉతుకుతూ.. బాత్రూమ్ క్లీన్ చేస్తూ.. ఫన్నీ వీడియో
కరోనావైరస్ కారణంగా సామాన్యుల నుండి ప్రముఖుల దాకా అందరికీ తమ తమ పనులు మానుకుని ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి తలెత్తిన సంగతి తెలిసిందే. దీంతో తాము ఇంట్లో ఉంటూ ఏం చేస్తున్నామో తెలియజేస్తూ కొంతమంది ప్రముఖులు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా పలు వీడియోలు, ఫోటోలను పంచుకుంటున్నారు.
కరోనావైరస్ కారణంగా సామాన్యుల నుండి ప్రముఖుల దాకా అందరికీ తమ తమ పనులు మానుకుని ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి తలెత్తిన సంగతి తెలిసిందే. దీంతో తాము ఇంట్లో ఉంటూ ఏం చేస్తున్నామో తెలియజేస్తూ కొంతమంది ప్రముఖులు తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా పలు వీడియోలు, ఫోటోలను పంచుకుంటున్నారు. ప్రముఖ క్రికెటర్ శిఖర్ ధావన్ సైతం లాక్ డౌన్ సమయంలో తాను ఇంట్లో ఏం చేస్తున్నానో చూడండంటూ ఓ ఫన్నీ వీడియోను పోస్ట్ చేశాడు. '' జబ్ సే హుయీ హై షాదీ... ఆంకే బహా రహా హూ... ఆఫత్ గలే పడీ హై.. ఉస్కో నిబారహా హూ'' అంటూ బ్యాగ్రౌండ్‌లో ఆనాటి హిట్ సాంగ్‌తో శిఖర్ ధవన్ ఓ ఫన్నీ వీడియోను అభిమానులతో షేర్ చేసుకున్నాడు.
Read also : ధోనీ ఫ్యాన్స్‌కి ఆగ్రహం తెప్పించిన BCCI పోస్టర్
పెళ్లయినప్పటి నుంచి ఏడుస్తూనే ఉన్నాను అనే అర్థం వచ్చే ఈ సాంగ్ లైన్స్‌తో ధావన్ పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజెన్స్‌ని కడుపుబ్బా నవ్విస్తోంది.. ఆకట్టుకుంటోంది. అంతేకాదు... శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీల దాంపత్యం ఎంత మధురంగా సాగుతుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.
ఆస్ట్రేలియాలో పెరిగిన ఆయేషా ముఖర్జీ తొలుత అక్కడే ఓ ఆస్ట్రేలియన్ బిజినెస్‌మేన్‌ని పెళ్లి చేసుకుంది. అతడితో కలిసి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యాకా.. భర్తతో విభేదాలు రావడంతో అతడికి విడాకులు ఇచ్చి శిఖర్ ధావన్‌ని పెళ్లి చేసుకుంది. బాక్సర్‌గాను పేరు తెచ్చుకున్న ఆయేషా ముఖర్జీ.. ధావన్‌తో పెళ్లి అనంతరం హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..