ధోనీ ఫ్యాన్స్‌‌కి ఆగ్రహం తెప్పించిన BCCI పోస్టర్

బీసీసీఐపై టీమిండియా మాజీ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు కోపం కట్టలు తెంచుకుంది. టీమిండియా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 13 మిలియన్ల మంది ఫాలోవర్లను పూర్తి చేసుకున్న సందర్భంగా ఫాలోవర్లకు అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టర్‌ను పోస్ట్ చేసింది.

Updated: Mar 25, 2020, 04:55 PM IST
ధోనీ ఫ్యాన్స్‌‌కి ఆగ్రహం తెప్పించిన BCCI పోస్టర్

బీసీసీఐపై టీమిండియా మాజీ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు కోపం కట్టలు తెంచుకుంది. టీమిండియా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 13 మిలియన్ల మంది ఫాలోవర్లను పూర్తి చేసుకున్న సందర్భంగా ఫాలోవర్లకు అందరికీ కృతజ్ఞతలు చెబుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్టర్‌ను పోస్ట్ చేసింది. ఈ పోస్టర్‌లో
పురుషులు, మహిళల జట్టు నుండి తొమ్మిది మంది ప్రముఖ క్రికెటర్ల ఫోటోలను ప్రదర్శించిన బీసీసీఐ... టీమిండియా లెజెండ్‌గా పేరొందిన ధోనిని విస్మరించింది. ఇక్కడే ధోనీ అభిమానులకు ఆగ్రహం వచ్చింది. ధోనీ లేనిదే టీమిండియా విజయాలను ఊహించుకోవడం కష్టమంటూ ధోనీ అభిమానులు బీసీసీఐ పోస్టర్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. పురుషుల జట్టు నుండి కెప్టేన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్, జస్‌ప్రీత్ బుమ్రా, శ్రేయాస్ అయ్యర్.. మహిళా క్రికెటర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధనా, పోనం యాదవ్‌లకు ఈ పోస్టర్‌పై చోటు దక్కింది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

A 13 Million strong family 🙏🙏 Thank you for your love and support 💙💙

A post shared by Team India (@indiancricketteam) on

 

గత ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన ఐసిసి ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ ఓటమి నుండి తిరిగొచ్చిన తర్వాత ఇప్పటివరకు మళ్లీ ఏ మ్యాచ్‌లోనూ ఆడని ధోనీ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమయ్యేలా ఇప్పటికే బీసీసీఐ ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాలో అతడి పేరు లేదు. దీనికితోడు తాజాగా బీసీసీఐ విడుదల చేసిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టర్‌లోనూ ధోనీ ఫోటో లేకపోవడం అతడి ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. అందుకే ధోనీ ఫ్యాన్స్ అదే సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..