Shoaib Akhtar Shocking Comments: పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై ఆ జట్టు మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో బాబర్‌ అజామ్ నేతృత్వంలోని టీ20 జట్టు 3-4తో పరాజయం పాలయ్యిన నేపథ్యంలో అక్తర్ ఈ కామెంట్స్ (Shoaib Akhtar Comments) చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 "పాకిస్థాన్ మిడిల్ ఆర్డర్ బాగా లేదు. ఓపెనర్లు రాణించకపోతే మిడిల్ ఆర్డర్ ఒత్తిడికి గురై కుప్పకూలిపోతుంది. టీ20 ప్రపంచకప్‌లో తొలి రౌండ్లోనే నిష్క్రమిస్తుందన్న భయం వేస్తోంది'' అని అక్తర్ అన్నాడు. పాకిస్తాన్ ముఖ్యంగా బాబర్, మహ్మద్ రిజ్వాన్ ఆధారపడుతోందని.. ఇప్పటికైనా టాప్ ఆర్డర్ ఆటగాళ్లు రాణించకపోతే కష్టమని అక్తర్ చెప్పుకొచ్చాడు. 


ఈ నెల చివరిలో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ (ICC T20 World Cup 2022) జరుగనుంది. అక్టోబర్ 23న టి20 ప్రపంచకప్‌లో తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్‌తో పాకిస్థాన్ తలపడనుంది. దీనికి ముందు, పాకిస్తాన్ అక్టోబర్ 7 నుండి ఆతిథ్య న్యూజిలాండ్ మరియు బంగ్లాదేశ్‌లతో టీ20 ముక్కోణపు సిరీస్‌ను ఆడనుంది. 


Also Read: ICC T20 WC 2022: వరల్డ్ టాప్-5 టీ20 ప్లేయర్లను ప్రకటించిన గిల్‌క్రిస్ట్..చోటు ఎవరెవరికీ దక్కిదంటే..!



 


పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు భారత క్రికెటర్లుపై కూడా తరుచూ ఏదో ఒక విధంగా కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఇటీవల భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా టీ20 వరల్డ్ కప్ ఆడతాడా లేదా అనే విషయంపై షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తే... విరాట్ కోహ్లీ మణికట్టు బ్యాటర్ కాదని, అతను ఫామ్ కోల్పోతే తిరిగి అందిపుచ్చుకోలేడని పాక్ మాజీ పేసర్ మహ్మద్ అసిఫ్ కామెంట్ చేశాడు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి