#CWG2018: 11కు చేరిన భారత్ స్వర్ణాలు
కామన్వెల్త్ క్రీడల్లో ఆరోరోజూ భారత్ హవా కొనసాగుతోంది.
గోల్డ్‌కోస్ట్ : కామన్వెల్త్ క్రీడల్లో ఆరో రోజూ భారత్ హవా కొనసాగుతోంది. కామన్వెల్త్ లో భారత్‌కు మరో స్వర్ణం లభించింది. 25 మీటర్ల మహిళల పిస్టల్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన హీనా సిద్ధూ స్వర్ణ పతకం గెలుచుకోవడం విశేషం. దీంతో ఈ టోర్నీలో భారత్ పతకాల సంఖ్య 20కి చేరింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 11 స్వర్ణాలు, 4 రజతాలు, 5 కాంస్యాలు ఉన్నాయి.
షూటింగ్‌లో 38 పాయింట్ల రికార్డు స్కోర్ నమోదు చేయడంతో హీనాకు స్వర్ణం ఖాయమైంది. ఇప్పటికే 10 మీటర్ల విభాగంలో హీనా రజతం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం భారత్ పతకాల జాబితాలో మూడోస్థానంలో కొనసాగుతోంది.
సోమవారం జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు మొత్తం మూడు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలు దక్కాయి. బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీం ఈవెంట్‌లో భారత్ స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. మలేసియా క్రీడాకారిణి సినియా చెహ్ పై సైనా నెహ్వాల్ చెమటోడ్చి గెలవడంతో టీమ్ ఈవెంట్‌లో భారత్ విజేతగా నిలిచింది.
సోమవారం పతక వీరులు వీరే
స్వర్ణం:జీతూ రాయ్ సింగ్; పురుషుల 10మీ. ఎయిల్ పిస్టల్
స్వర్ణం : బాడ్మింటన్ మిక్స్‌డ్ టీం ఈవెంట్
స్వర్ణం: పురుషుల టీటీ జట్టు విభాగం
రజతం: మెహులి ఘోష్ ( షూటింగ్); మహిళల 10మీ. ఎయిల్ పిస్టల్
రజతం: పర్ దీప్ సింగ్ (వెయిట్ లిఫ్టింగ్) పురుషుల 105 కేజీలు
కాంస్యం: ఓంప్రకాశ్ మిత్రావాల్ (షూటింగ్); పురుషుల 10మీ. ఎయిల్ పిస్టల్
కాంస్యం: అపూర్వీ చందేలా(షూటింగ్); పురుషుల 10మీ. ఎయిల్ పిస్టల్