IND VS ENG 03rd Test: టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌(Shreyas Iyer) అదరగొడుతున్న శ్రేయస్ అయ్యర్.. టెస్టులో మాత్రం విఫలమవుతూ వస్తున్నాడు. ఆసియా కప్ లో అద్భుతంగా ఆడిన శ్రేయస్.. ప్రస్తుతం ఇంగ్లండ్ తో జరిగిన టెస్టులో మాత్రం రాణించలేకపోతున్నాడు. గత నాలుగు టెస్టుల్లో క‌నీసం ఒక్క హాఫ్ సెంచ‌రీ కూడా చేయలేకపోయాడు శ్రేయస్. అయ్య‌ర్ ఇప్పటివ‌ర‌కూ ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో వ‌రుస‌గా.. 31, 6, 0, 4 నాటౌట్, 35, 12, 27, 29 పరుగుల సాధించాడు. దీంతో ఇంగ్లండ్ తో జరిగే రాజ్ కోట్ టెస్టులో అతడిపై వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంగ్లండ్‌తో సిరీస్ లో తొలి రెండు టెస్టులు ముగియ‌గా.. మిగతా మూడు టెస్టులకు బీసీసీఐ స్క్వాడ్‌ను అనౌన్స్ చేయనుంది. దీంతో అయ్యర్ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనే విషయం ఆసక్తికరంగా మారింది. వ్యక్తిగత కారణాల వల్ల మెుదటి రెండు టెస్టులకు దూరమైన విరాట్ కోహ్లీ.. మిగతా మ్యాచ్ లకు అందుబాటులో ఉంటాడో లేదో తెలియాల్సి ఉంది. ఒక వేళ కోహ్లీ ఆడకపోతే.. ర‌జ‌త్ పాటిదార్‌ను మరో మ్యాచ్ ఆడించే అవకాశం ఉంది. ఇక అయ్యర్ స్థానంలో సర్ఫరాజ్ ను ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయం కారణంగా వైజాగ్ టెస్టుకు దూరమైన కేఎల్ రాహుల్, ర‌వీంద్ర జ‌డేజాలు ఫిట్‌నెస్ సాధిస్తే టీమిండియాకు బ్యాటింగ్ కష్టాలు తప్పినట్టే. ఐదు టెస్టుల సిరీస్‌లో భారత్, ఇంగ్లండ్‌లు ఇప్పటికే చెరో మ్యాచ్ గెలిచాయి. కీలకమైన మూడో టెస్టు రాజ్‌కోట్‌ వేదికగా ఫిబ్ర‌వరి 15వ తేదీన జరుగనుంది. 


Also Read: Sachin Das: సచిన్ టెండ్యూల్కర్ కాదు.. ఇప్పుడు భారత క్రికెట్ లో సచిన్ దాస్ ట్రెండింగ్.. ఎవరీ యువ క్రికెటర్?


Also Read: ICC Rankings: ఆ ఘనత సాధించిన తొలి ఆసియా క్రికెటర్లుగా కోహ్లీ, బుమ్రా..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి