Kohli- Bumrah Rare feet: టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ(Virat Kohli), జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) అరుదైన ఘనత సాధించారు. మూడు ఫార్మాట్లలో నంబర్ 1 ర్యాంక్ సాధించిన తొలి ఆసియా ఆటగాళ్లుగా రికార్డు సృష్టించారు. ఐసీసీ బుధవారం ప్రకటించిన టెస్టు బౌలర్ ర్యాంకింగ్స్(Test Bowler Rankings)లో బుమ్రా నంబర్ 1 స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. దాంతో కోహ్లీ తర్వాత టెస్టులు, వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానం దక్కించుకున్న తొలి భారత ఆటగాడిగా బుమ్రా చరిత్రకెక్కాడు. అంతేకాదు టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్ కైవసం చేసుకున్న తొలి భారత్ పేసర్ గా బుమ్రా రేర్ ఫీట్ సాధించాడు.
కింగ్ కోహ్లీ టీమిండియా తరపున అన్ని ఫార్మాట్లలో నంబర్ 1 ర్యాంక్ సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఈ స్టార్ ప్లేయర్ 2013లో వన్డే ర్యాంకింగ్స్‌లోనూ, 2018 టెస్టు ర్యాంకింగ్స్‌లోనూ, 2022లో టీ20 ర్యాంకింగ్స్‌లోనూ నంబర్ వన్ ర్యాంకును దక్కించుకున్నాడు. మరోవైపు బుమ్రా రెండేళ్ల క్రితం వన్డేల్లో, టీ20ల్లో టాప్ ర్యాంకును దక్కించుకున్నాడు. వైజాగ్ టెస్టులో ఇంగ్లండ్ పై సంచల బౌలింగ్ చేసి టెస్టుల్లో తొలి ర్యాంకు సాధించాడు. దీంతో మూడు ఫార్మాట్లలో నంబర్ 01న ర్యాంకు దక్కించుకున్న రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం బుమ్రా వన్డేల్లో ఆరో ర్యాంకులోనూ, టీ20ల్లో 82వ ర్యాంకులోనూ కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు టీ20ల్లో 74 వికెట్లు, వన్డేల్లో 149 వికెట్లు, టెస్టుల్లో150 వికెట్లు పడగొట్టాడు కోహ్లీ.
ఐసీసీ బుధవారం టెస్టు ర్యాంకింగ్స్ ను ప్రకటించింది. ఇప్పటి వరకు టీమిండియా స్టార్ స్పిన్నర్ అశ్విన్ వెనక్కి నెట్టి బుమ్రా అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు. దీంతో అశ్విన్ మూడో స్థానానికి పడిపోయాడు. రెండో స్థానంలో సఫారీ పేసర్ కగిసో రబాడ కొనసాగుతున్నాడు. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 9వ ర్యాంక్ దక్కించుకున్నాడు.
Also Read: U19 World Cup 2024: దక్షిణాఫ్రికాను చిత్తు చేసి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన యువ భారత్..
Also read: U19 World Cup: అండర్ 19 వరల్డ్ కప్ ను టీమిండియా ఎన్నిసార్లు గెలిచిందో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి