IND vs NZ: శుభ్‌మన్ గిల్ సెంచరీ.. మూడో టీ20లో భారత్ ఘన విజయం! 2-1తో సిరీస్ కైవసం
Shubman Gill and Hardik Pandya power India to record win vs New Zealand. బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ భారీ విజయం సాధించింది. ఈ విజయంతో 2-1తో సిరీస్ ఖాతాలో చేరింది.
Shubman Gill and Hardik Pandya power India to record win vs New Zealand: నరేంద్ర మోదీ స్టేడియంలో బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ భారీ విజయం సాధించింది. 235 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్.. 12.1 ఓవర్లలో 66కే కుప్పకూలింది. దాంతో టీమిండియా 168 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. కివీస్ బ్యాటరలలో డరైల్ మిచెల్ (35), మిచెల్ శాంట్నర్ (13) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. భారత బౌలర్ హార్దిక్ పాండ్యా (4/16) నాలుగు వికెట్లతో చెలరేగాడు. ఈ విజయంతో 2-1తో సిరీస్ భారత్ ఖాతాలో చేరింది.
భారీ లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌కు ఇన్నింగ్స్ ఆరంభంలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్లో ఫిన్ అలెన్ (3)ను హార్దిక్ పాండ్యా ఔట్ చేశాడు. రెండో ఓవర్లో డెవాన్ కాన్వే (1)ను అర్ష్‌దీప్ సింగ్ పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే మార్క్ చాప్‌మన్ (0)ను అర్ష్‌దీప్ ఔట్ చేయగా.. గ్లెన్ ఫిలిప్స్ (2)ను హార్దిక్ పెవిలియన్ చేర్చాడు. ఐదో ఓవర్లో ప్రమాదకర మైకెల్ బ్రాస్‌వెల్ (8)ను ఉమ్రాన్ మాలిక్ బౌల్డ్ చేయడంతో.. న్యూజిలాండ్ 21/5తో నిలిచింది.
శివమ్ మావి, హార్దిక్ పాండ్యా తలో రెండు వికెట్లు పడగొట్టడంతో కివీస్ ఆలౌట్ అయింది. ఓవైపు వికెట్లు పడుతున్నా డరైల్ మిచెల్ (35) ఒంటరి పోరాటం చేశాడు. దాంతో కివీస్ 66 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య (4/16), ఉమ్రాన్ మాలిక్ (2/9), శివమ్ మావి (2/12), అర్ష్‌దీప్ సింగ్ (2/16) చెలరేగారు. హార్దిక్ పాండ్యా ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’గా, 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యారు.
అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 రన్స్ చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కివీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ సెంచరీ బాదాడు. 63 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌ల సాయంతో 126 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. రాహుల్ త్రిపాఠి (44; 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కివీస్ బౌలర్లలో మైఖేల్ బ్రాస్‌వెల్, ఇష్ సోధీ, బ్లెయిర్ టిక్నర్ తలో వికెట్ పడగొట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.