Andhra Captain Hanuma Vihari bats left-handed after Injury in Ranji Trophy 2023: తెలుగు క్రికెర్ క్రికెటర్ హనుమ విహారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత జట్టు తరఫున టెస్టుల్లో ఆడుతూ మంచి పేరు సంపాదించాడు. తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకున్నాడు. బ్యాటింగ్ చేసే సమయంలో విహారి తన గాయాన్ని కూడా లెక్కచేయడు. గతంలో వెన్ను నొప్పితో ఇబ్బంది పడుతూ కూడా టీమిండియా తరఫున చివరి వరకూ పోరాడి మ్యాచ్‌ను డ్రా చేశాడు. మరోసారి విహరి అదే పనిచేశాడు. ఆంధ్రా కెప్టెన్ అయిన హనుమా విహరి మణికట్టు గాయం లెక్కచేయకుండా బ్యాటింగ్ చేశాడు.
రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా మధ్యప్రదేశ్, ఆంధ్రా జట్ల మధ్య మంగళవారం (జనవరి 31) క్వార్టర్ ఫైనల్ పోరు మొదలైంది. ఈ మ్యాచులో ఆంధ్రా జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగింది. తొలి రోజు ఆటలో హనుమ విహరి 16 పరుగుల వద్ద ఉన్నప్పుడు అతడి ఎడమచేతి మణికట్టుకు గాయమైంది. పేసర్ అవేశ్ ఖాన్ వేసిన బంతి విహారి ఎడమచేతి మణికట్టుకు బలంగా తాకింది. దాంతో నొప్పితో విలవిలలాడుతూ (Hanuma Vihari Injury) అతడు రిటౌర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. రెండో రోజు ఆటలో కరణ్ షిండే, రికీ భుయ్ సెంచరీల అనంతరం ఆంధ్ర ఆటగాళ్లు వరుసగా పెవిలియన్‌కు చేరారు.
ఆంధ్రా జట్టు 30 పరుగుల వ్యవధిలో 7 వికెట్లు కోల్పోయి భారీ స్కోర్ చేసే అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ దశలో మణికట్టు ఫ్రాక్చర్‌ను సైతం లెక్క చేయకుండా హనుమ విహరి బరిలోకి దిగాడు. కుడి చేతివాటం బ్యాటర్ అయిన విహారి లెఫ్ట్ హ్యాండర్‌గా (Hanuma Vihari Left Handed) బరిలోకి దిగాడు. మణికట్టుకు గాయం కాకుండా ఉండేందుకు లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేశాడు. మొత్తంగా 57 బంతుల్లో 27 రన్స్ చేశాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విహారి సాహసోపేతమైన పోరాటానికి అభిమానులు ఫిదా అవుతున్నారు. 'విహారి భయ్యా సూపర్', 'నిజమైన పోరాట యోధుడివి' అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
In the Quarter-final of Ranji Trophy, Andhra 9 down, Hanuma Vihari fracture his wrist and decided to bat left-handed.
The fighter, Vihari. pic.twitter.com/guDUIjESp9
— Johns. (@CricCrazyJohns) February 1, 2023
హనుమ విహరి ఇన్నింగ్స్‌తో ఆంధ్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 379 పరుగుల స్కోరు చేసింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మధ్యప్రదేశ్ 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ఏపీ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 235 పరుగుల వెనుకంజలో ఉంది. యశ్ దూబే (20), హిమాన్షు మంత్రి (22), రజత్ పాటిదార్ (20) త్వరగానే ఔట్ కాగా.. శుభమ్ శర్మ (51) హాఫ్ సెంచరీ చేశాడు. ఈ నెలలో స్వదేశంలో జరగనున్న ఆస్ట్రేలియా సిరీస్‌కు విహారి చోటు దక్కని విషయం తెల్సిందే.
Also Read: Sam Billings Run-Out: మెరుపు వేగంతో రనౌట్.. ఎంఎస్ ధోనీని మరిపించిన సామ్ బిల్లింగ్స్! వీడీయో వైరల్
Also Read: Womens IPL Auction 2023: ఐపీఎల్ 2023 వేలంకు ముహూర్తం ఖరారు.. వేదిక ఎక్కడో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Hanuma Vihari Injury: గాయాన్ని లెక్కచేయకుండా.. లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేసిన హనుమ విహారి! వీరోచిత పోరాటం
గాయాన్ని లెక్కచేయకుండా
లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేసిన విహారి
విహారి వీరోచిత పోరాటం