Srllanka vs Afghanistan Live Score: శ్రీలంక ఓపెనర్ నిస్సాంక చరిత్ర సృష్టించాడు. అప్గానిస్తాన్ తో జరుగుతున్న తొలి వన్డేలో డబుల్ సెంచరీతో చెలరేగాడు. 136 బంతుల్లో 20 ఫోర్లు, 8 సిక్సర్ల సహాయంతో 211 పరుగులు చేశాడు. దీంతో శ్రీలంక 3 వికెట్లు కోల్పోయి 381 పరుగులు చేసింది. లంక తరపున వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు. 24 ఏళ్ల కిందట జయసూర్య నెలకొల్పిన అత్యధిక పరుగుల రికార్డును నిస్సాంక బద్దలుకొట్టాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంకకు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు నిస్సాంక, ఫెర్నోండో. ముఖ్యంగా నిస్సాంక ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. మరో ఎండలో ఫెర్నోండో అతడికి సహకరించాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 182 పరుగులు జత చేశారు. 88 బంతుల్లో మూడు సిక్సర్లు, 8 ఫోర్లుతో 88 పరుగులు చేసిన ఫెర్నాండో ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండిస్ స్వల్పస్కోరుకే ఔటయ్యాడు. మరో వైపు నిస్సాంక తన జోరు కొనసాగించాడు. సమర విక్రమ కూడా రాణించడంతో శ్రీలంక స్కోరు బోర్డు పరుగులెత్తింది. ఈ క్రమంలో నిస్సాంక డబుల్ సెంచరీతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో శ్రీలంక 50 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 381 పరుగులు చేసింది.


Also Read: U-19 World Cup Final: సెమీ‌స్‌లో పాక్‌పై విజయం.. ఫైన‌ల్స్‌లో టీమిండియా ప్రత్యర్థిగా ఆస్ట్రేలియా..!


అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన అప్ఘాన్ టీమ్ ను లంక బౌలర్లు బెంబేలెత్తిస్తున్నారు. 9 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 55 పరుగులు చేసింది అప్ఘాన్. గుర్బాజ్, జద్రాన్, రెహ్మత్ షా, షాహీద్ సింగిల్ డిజిట్స్ కే పరిమతమయ్యారు. 


Also Read: India vs England: మూడో టెస్టుకు ఆ స్టార్ బ్యాటర్ స్థానంలో సర్ఫరాజ్?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి