Smriti Mandhana Record: భారత మహిళా క్రికెటర్‌లలో స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన సంచలనాలు సృష్టిస్తోంది. రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ పురుషులకు సాటిలేదని నిరూపిస్తోంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న సిరీస్‌లలో రెండు శతకాలతో మోత మోగించిన స్మృతి మరో సంచలన ప్రదర్శన చేసింది. బ్యాట్‌తోనే కాదు బంతితోనూ చెలరేగలనని నిరూపించింది. తాను వేసిన బౌలింగ్‌లో ఓ వికెట్‌ తీసి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Uppal Stadium: ఊపిరి పీల్చుకున్న ఉప్పల్‌ స్టేడియం.. కోట్లలో ఉన్న కరెంట్‌ బిల్లులు చెల్లింపు


 


దక్షిణాఫ్రికాతో భారత్‌ మూడు వన్డేలకు ఆతిథ్యమిస్తోంది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌ అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను సొంతం చేసుకుని విజయోత్సాహంతో బుధవారం రెండో మ్యాచ్‌ ఆడింది. అదే వేదికపై జరిగిన ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించిన భారత్‌ సిరీస్‌ను ఖాతాలో వేసుకుంది. అయితే ఈ మ్యాచ్‌లో వైస్ కెప్టెన్‌ స్మృతి మందన ప్రదర్శన గురించి మాట్లాడకుండా ఉండలేం. ఈ సిరీస్‌లోనే స్మృతి చెలరేగి ఆడింది. తొలి మ్యాచ్‌లో 117 పరుగులు చేసి సత్తా చాటగా.. తాజా మ్యాచ్‌లో 120 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. 136 బంతుల్లో 18 ఫోర్లు, 2 సిక్స్‌లతో స్మృతి విధ్వంసం సృష్టించింది.

Also Read: Saurabh Netravalkar: మనోడే అనుకుంటే ముంచేసేలా ఉన్నావే.. ఇండియాకు వచ్చేయ్ బ్రో.. ఆ బౌలర్‌కు పిలుపు..!


 


ఈ ప్రదర్శనతో స్మృతి మందన తన పేరిట ఉన్న రికార్డులను చెరిపేసుకుని కొత్త రికార్డులు నమోదు చేసింది. మహిళా వన్డే క్రికెట్‌లో వరుసగా రెండు సెంచరీలు చేసిన తొలి భారత మహిళా బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పింది. తాజా శతకంతో మాజీ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ రికార్డును స్మృతి సమం చేసింది. స్మృతి ఖాతాలో ఇది ఏడో సెంచరీ కావడం విశేషం. అయితే మిథాలీ 211 వన్డే ఇన్నింగ్స్‌లో ఏడు శతకాలు నమోదు చేయగా.. సమృతి 84 ఇన్నింగ్స్‌లోనే మిథాలీ రికార్డును సమం చేసింది. అంటే మిథాలీ కన్నా 127 ఇన్నింగ్స్‌ మిగిలి ఉండగానే ఈ రికార్డు నెలకొల్పడం విశేషం.


వికెట్‌
అయితే బుధవారం జరిగిన మ్యాచ్‌లో స్మృతి మరో ఘనత సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 50 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 325 పరుగులు చేసింది. స్మృతితోపాటు కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ కూడా సెంచరీ చేసింది. 88 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 103 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. శఫాలీ వర్మ (20), దయాలన్‌ హేమలత (24), రిచా ఘోష్‌ (25) పరుగులు చేశారు. అయితే ఫీల్డింగ్‌కు దిగిన భారత జట్టులో సెంచరీ వీరనారి స్మృతి కూడా బౌలింగ్‌ వేసింది. తన బౌలింగ్‌ ఓ వికెట్‌ కూడా పడగొట్టడం విశేషం. స్మృతి వేసిన బంతిని దక్షిణాఫ్రికా బ్యాటర్‌ సూనీ లుస్‌ టచ్‌ చేసి వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చేసి వెనుదిరిగింది. వికెట్‌ తీసిన ఆనందంలో స్మృతి సంబరాలు మామూలుగా లేవు. సెంచరీతోపాటు ఒక వికెట్‌ పడగొట్టడంతో స్మృతి ఆనందానికి అవధులు లేవు. ఆమె ప్రదర్శన జట్టు సభ్యులంతా అభినందించారు.



 




 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి