ఫుట్‌బాల్ అనేది ఒక బంతి అట. ఈ ఆటను ప్రపంచంలో విరివిగా ఆడుతారు. మన దేశంలో ఈ క్రీడకు ఆదరణ క్రికెట్ అంతలా లేకపోయినా.. ఇతర దేశాల్లో మాత్రం ఈ ఆటకు తెగ ఆదరణ ఉంది. మీరు నమ్మండి.. నమ్మకపోండి.. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ఆట ఫుట్‌బాల్. ఈ ఆటలో క్రీడాకారులు మైదానంలో చిరుతల్లా పరిగెత్తుతూ.. అద్భుతమైన గోల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. ఈ ఆటకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.


  • ఫుట్‌బాల్ చైనాలో 476 BCలో ప్రారంభమైంది.

  • ఫుట్‌బాల్ ప్రపంచంలో ఎక్కువ మంది ఆడే, చూసే ఆట. దాదాపు వంద కోట్ల మంది ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌ని టీవీలో చూస్తారట.

  • ఫుట్‌బాల్ టోర్నమెంట్లలో 1999లో జరిగిన 'బ్యాంకాక్ లీగ్ సెవెన్-ఏ-సైడ్' అతి పెద్దది. ఇందులో దాదాపు 5098 జట్లు.. 35,000 మంది క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొన్నారు.

  • ఒకే మ్యాచ్‌లో అత్యధిక గోల్స్(16) చేసిన ఆటగాడు ఫ్రాన్స్‌కు చెందిన స్టీఫన్ స్టానిస్. 1942లో రేసింగ్ క్లబ్ ది లెనిన్ తరఫున ఆడి ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు.

  • ప్రస్తుతం ఉన్న వీడియోల ఆధారంగా 1998 డిసెంబర్‌లో జరిగిన ఒక మ్యాచ్‌లో ఆట ప్రారంభమైన 2.8 సెకెండ్లలోనే రికార్డో ఒలివేరా(ఉరుగ్వే) గోల్ చేశాడు.

  • ఈ ఆటలో క్రీడాకారులు గంటకు సుమారు 9.65 కి.మీల వేగంతో పరిగెత్తుతారు.

  • 1913 వరకు టీం సభ్యులు ఒకే రకమైన రంగు రంగుల టీషర్టులను ధరించేవారు కాదు.

  • తొలిసారి బాస్కెట్ బాల్ ఆడినప్పుడు బాల్ గా ఫుట్‌బాల్ ఉపయోగించారు.

  • ప్రపంచంలో తొలి ఫుట్‌బాల్ క్లబ్ ఇంగ్లిష్ షిఫీల్డ్ ఫుట్‌బాల్ క్లబ్. 1857లో దీనిని కొలోనెల్ నథినియర్ క్రెన్విస్, మేజర్ విలియం ప్రీస్ట్, ఇద్దరు బ్రిటీష్ ఆర్మీ అధికారులు కలిసి ఈ క్లబ్‌ను ప్రారంభించారు.

  • ఫుట్‌బాల్ ఆటలో ఒకే మ్యాచ్‌లో ఎక్కువ గోల్స్ 149-0గా నమోదైంది. మడగాస్కర్‌కు చెందిన ఒలంపిక్ డి ఎల్ ఎమేర్ని జట్టు వీటిని సెల్ఫ్ గోల్స్ చేసింది. గత మ్యాచ్‌లో రెఫరీ నిర్ణయానికి వ్యతిరేకంగా వాళ్లు ఇలా చేశారు.

  • తొలి మ్యాచ్‌లో గోల్ చేసిన ఆనందంలో లూగీ రివాక్ తన శక్తివంతమైన షాట్‌తో ప్రేక్షకుడిని గాయపరిచాడు.

  • పీలే తొలిసారి ఫుట్‌బాల్‌ను అందమైన ఆటగా అభివర్ణించాడు.

  • అమెరికా, కెనడా ప్రజలు ఫుట్‌బాల్‌ను 'సాకర్'గా పిలుస్తారు.

  • పెరూలో 1964లో జరిగిన ఒక మ్యాచ్‌లో రెఫరీ తప్పుడు నిర్ణయం ప్రకటించడంతో అల్లర్లు చెలరేగి 300 మంది చనిపోయారు.

  • 1998లో ఒక జట్టు సభ్యులను చంపేశారు. కాంగోలో బెనాశాడి, బసంగా గ్రామాల మధ్య జరిగిన పోటీల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.

  • నీల్‌ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రునిపైకి ఫుట్‌బాల్‌ను తీసుకెళ్లాలని అనుకున్నాడు. కానీ నాసా అది అమెరికాది కాదని తీసుకెళ్లనివ్వలేదు.

  • 125 సంవత్సరాలుగా ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు బాల్ ఆకారాన్ని ఒకే విధంగా 28 అంగుళాలుగా కొనసాగిస్తున్నారు.

  • దాదాపు 80 శాతం ఫుట్‌బాల్స్ పాకిస్థాన్‌లో తయారవుతాయి.

  • తొలిసారిగా టీవీలో ఫుట్‌బాల్ ప్రత్యక్ష ప్రసారం 1937లో జరిగింది. ఇది హైబరీలోని(లండన్)అర్సేనల్ స్టేడియంలో జరిగిన ఓ ప్రాక్టీస్ మ్యాచ్

  • స్పోర్టివో అమేలియానో, జనరల్ కాబల్లేరో మధ్య పరాగ్వేలో జరిగిన మ్యాచ్‌లో రెఫరీ ఇరుజట్ల ఆటగాళ్లకు 20 రెడ్ కార్డ్స్ చూపించాడు.  

  • మొదటి ప్రపంచ కప్‌ను 1930లో ఆడారు. ఉరుగ్వే టోర్నమెంట్ హోస్ట్ మరియు విజేత.

  • చరిత్రలో మొట్టమొదటిసారిగా, 2002 ప్రపంచ కప్ రెండు వేర్వేరు దేశాల్లో జరిగింది: దక్షిణ కొరియా మరియు జపాన్.

  • 1950 నాటి టోర్నమెంట్ నుండి భారతదేశం తిరస్కరించినట్లు పుకార్లు వ్యాపించాయి.

  • యూరోపియన్ జట్లు 1930, 1950 మినహా ప్రతి ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేరుకున్నాయి.