క్రికెట్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వారు లేరంటే అతియోశక్తికాదు. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ దాదా అని క్రికెట్ ప్రపంచం ముద్దుగా పిలుకుంటుంది. రిటైర్డ్ అయి పదేళ్లు అవుతున్న దాదా మళ్లీ బ్యాట్ పట్టాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ లో కాదండోయ్... ఐపీఎల్ ప్రాక్టిస్ సెషన్లో... ఐపీఎల్ లో భాగంగా ఢిల్లీ డేర్ డెవెల్సి జట్టు మర్గనిర్దేశకుడిగా వ్యవహరిస్తున్న గంగూలీ  ఓ ప్రాక్టీస్‌ సెషన్‌లో చూడచక్కని కట్‌ షాట్లతో పాటు తన ఫేవరెట్‌ కవర్‌ డ్రైవ్‌లను ఆడాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గుంగూలి ఆడిన షాట్లకు సంబంధించిన వీడియోను ఢిల్లీ జట్టు తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. దీంతో వీడియో చూసిన క్రికెట్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ‘గంగూలీ కాలచక్రాన్ని వెనక్కి తిప్పాలనుకుంటున్నాడు. ఆ కట్‌షాట్లు, కవర్‌డ్రైవ్‌లు చూస్తుంటే మీ 90ల్లోని ఆట గుర్తొచ్చిందా?’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. 


గుంగులీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది...దాదా ఈజ్ బ్యాక్ అంటూ కొందరు.. రియల్ బెంగాల్ టైగల్ అంటూ ఇంకొకరు..కవర్ డ్రైవ్ గాడ్ అంటూ మరొకరు ఇలా దాదాపై ప్రసంశల వర్షం కురిపిస్తున్నారు. దాదా ఆడిన చూడచక్కని కవర్ డ్రైవ్ లను మీరు చూసి ఎంజాయ్ చేయండి...