వారెవ్వా..! కలలో కూడా అనుకోలేదు..!!
ఈ మాట అన్నది ఎవరో కాదు..భారత స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్.
ఈ మాట అన్నది ఎవరో కాదు.. భారత స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్. ఈ మాట అనాల్సిన అవసరం ఏమొచ్చిందా? అనేగా మీ డౌట్..! శిఖర్ ధావన్ ఊహించని రీతిలో సంపాదిస్తున్నాడట. అవును, ఈ మాట స్వయానా శిఖర్ ధావనే మీడియా సాక్షిగా చెప్పారు.
ఇటీవల బీసీసీఐ కాంట్రాక్టుల్లో శిఖర్ ధావన్‌కు ఏ+ గ్రేడ్ లభించింది. దీంతో ధావన్ బ్యాట్స్‌మెన్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలతో పాటు ఏడాదికి రూ. 7 కోట్లు పారితోషికంగా అందుకోనున్నాడు. గత ఏడాది గ్రేడ్-సిలో ఉన్న టీం ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్.. ప్రస్తుతం అద్భుతమైన ఫాంలో ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌ని భారత్ 5-1 తేడాతో కైవసం చేసుకోవడంలో ధావన్ కీలక పాత్ర పోషించాడు.
ఈ నేపథ్యంలో ధావన్ ప్రతిభను గమనించిన బీసీసీఐ అతన్ని గ్రేడ్-సి నుంచి ఏ+ గ్రేడ్‌లో చేర్చి వేతనాన్ని రూ.7 కోట్లకి పెంచింది. దీనిపై ధావన్ స్పందించాడు. టాప్ గ్రేడ్‌లో చోటు దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. నేను టీం ఇండియా కోసం అద్భుతంగా ఆడుతున్నాను. ఇంత సంపాదిస్తానని కలలో కూడా ఊహించలేదన్నారు.
'దక్షిణాఫ్రికాలో అద్భుతమైన క్రికెట్ ఆడాం. టెస్టుల్లో ఓడినప్పటికీ.. వన్డే, టీ20 సిరీస్‌లు గెలుపొందాం. గతంలో ఏ భారత జట్టుకు ఇది సాధ్యపడలేదు. మేం విజయం సాధించినందుకు గర్వంగా ఉంద'ని ధావన్ ఈ సందర్భంగా తెలిపాడు. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌లో ధావన్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ప్రాతినిథ్యం వహించనున్న సంగతి విదితమే.