India's campaign ends in ICC Women's World Cup: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ 2022లో భారత్‌ పోరాటం ముగిసింది. సెమీస్‌కు చేరకుండానే మిథాలీ సేన ఇంటి బాట పట్టింది. లీగ్ దశలో దక్షిణాఫ్రికాతో తప్పక గెలవాల్సి మ్యాచ్‌లో మహిళల జట్టు ఓటమిపాలైంది. టీమిండియా నిర్దేశించిన 275 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా చివరి బంతికి చేధించింది. చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్ మిగ్నాన్‌ డు ప్రీజ్‌ (52 నాటౌట్‌; 63 బంతుల్లో 2x4) హాఫ్ సెంచరీతో మెరిసింది. ఓపెనర్ లారా వోవార్డ్‌ (80; 79 బంతుల్లో 11x4) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్, హర్మన్‌ప్రీత్ కౌర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

275 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణఫ్రికాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ లిజెల్ లీ త్వరగానే ఔట్ అయింది. లారా గూడాల్ (49: 69 బంతుల్లో 4x4) అండతో మరో ఓపెనర్ లారా వోవార్డ్‌ స్కోరు బోర్డుని ముందుకి నడిపించింది. ఇద్దరు కలిసి భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించి పరుగులు చేశారు. ఈ క్రమంలో లారా వోవార్డ్‌ హాఫ్ సెంచరీ చేశారు. అయితే వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టిన హర్మన్‌ప్రీత్ కౌర్.. భారత్ జట్టుని మళ్లీ మ్యాచ్‌లోకి తెచ్చింది. దీప్తి శర్మ, రాజేశ్వర్ గైక్వాడ్ కూడా పొదుపుగా బౌలింగ్ చేయడంతో.. దక్షిణాఫ్రికాపై ఒత్తిడి పెరిగింది. కానీ కాప్ (32), ట్రయాన్ (17)తో సమయోచితంగా ఆడిన డుప్రీజ్ ఆఖరి బంతికి దక్షిణాఫ్రికాని గెలిపించింది.


చివరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా విజయానికి 7 పరుగులు అవసరం అవ్వడంతో మ్యాచ్ ఉత్కంఠ స్థాయికి చేరింది. తొలి బంతికి సింగిల్‌ సాధించిన దక్షిణాఫ్రికా.. రెండో బంతికి చెట్టీ (7) వికెట్‌ కోల్పోయింది. దాంతో సమీకరణం నాలుగు బంతుల్లో 5 పరుగులుగా మారింది.  ఐదో బంతికి డుప్రీజ్ భారీ షాట్‌ ఆడి.. హర్మన్‌ప్రీత్‌ చేతికి చిక్కినా అది నోబాల్‌గా నమోదైంది. దీంతో భారత్‌కు నిరాశ ఎదురైంది. చివరి రెండు బంతులకు దక్షిణాఫ్రికా బ్యాటర్లు సింగిల్స్‌ తీసి భారత్‌ను ఓడించారు.



అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. ఓపెనర్లు స్మృతి మంధాన (71; 84 బంతుల్లో 6x4, 1x6), షెఫాలీ వర్మ (53; 46 బంతుల్లో 8x4, కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (68; 84 బంతుల్లో 8x4) హ్లఫ్సీ సెంచరీలు చేయారు. హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (48; 57 బంతుల్లో 4x4) మంచి ఇన్నింగ్స్ ఆడింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మసాబటా క్లాస్‌, షబ్నిమ్‌ ఇస్మైల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఇప్పటికే సెమీస్‌కి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా అర్హత సాధించగా.. భారత్ ఓడిపోవడంతో వెస్టిండీస్ నాలుగో జట్టుగా సెమీ ఫైనల్‌కి చేరుకుంది. 


Also Read: Suryakumar Yadav: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌.. ఢిల్లీతో మ్యాచ్‌కు దూరమయిన స్టార్ బ్యాటర్! ఏబీడీకి ఛాన్స్!!


Also Read: RRR Movie: 'ఆర్ఆర్ఆర్‌'లో ఎన్టీఆర్ నటనకు థియేటర్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్న మహిళ... వీడియో వైరల్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook