RRR Movie: 'ఆర్ఆర్ఆర్‌'లో ఎన్టీఆర్ నటనకు థియేటర్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్న మహిళ... వీడియో వైరల్...

Woman gets emotional for NTR acting in RRR:ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ 'కొమురంభీముడో' పాటకు ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. తెరపై ఎన్టీఆర్ నటనకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 27, 2022, 02:39 PM IST
  • ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు ఫిదా
  • థియేటర్‌లోనే కన్నీళ్లు పెట్టుకుంటున్న ప్రేక్షకులు
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ మహిళ వీడియో
RRR Movie: 'ఆర్ఆర్ఆర్‌'లో ఎన్టీఆర్ నటనకు థియేటర్‌లోనే కన్నీళ్లు పెట్టుకున్న మహిళ... వీడియో వైరల్...

Woman gets emotional for NTR acting in RRR: సినిమా చూస్తున్న ప్రేక్షకుడిని కథలో లీనం చేయాలంటే వెండి తెరపై కనిపించే పాత్రలు అద్భుతమైన నటనతో మెప్పించగలిగాలి. ప్రతీ సన్నివేశంలో ప్రేక్షకుడిని కట్టిపడేసే హావభావాలు పలికించగలిగాలి. ఈ విషయంలో ఆర్ఆర్ఆర్ సినిమాలో తమ పాత్రలకు ఎన్టీఆర్, రామ్ చరణ్ వంద శాతం న్యాయం చేశారు. వెండి తెరపై ఈ ఇద్దరి నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తున్నాయి.

ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ 'కొమురంభీముడో' పాటకు ప్రేక్షకులు ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. తెరపై ఎన్టీఆర్ నటనకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఓ మహిళ థియేటర్‌లో ఈ సన్నివేశాన్ని చూస్తూ కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ చరణ్ కొరడాతో ఎన్టీఆర్‌ను కొడుతుంటే.. భావోద్వేగానికి గురై ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. కొమురంభీముడో పాటకు గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించారు. సినిమాలో ఈ పాట, ఎన్టీఆర్ నటన ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేస్తున్నాయి.

రెండు రోజుల క్రితం విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.223 కోట్లు కొల్లగొట్టింది. శనివారం (మార్చి 26) ప్రపంచవ్యాప్తంగా రూ.110-120 కోట్ల గ్రాస్‌ వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా మొదటి రెండు రోజుల్లో ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం రూ.340-350 కోట్ల వరకు వసూళ్లు రాబట్టినట్లు చెబుతున్నారు. హిందీలో ఈ సినిమా తొలి రోజు రూ.18 కోట్లు రాబట్టగా... రెండో రోజు రూ.24 కోట్ల వసూళ్లు రాబట్టడం విశేషం. లాంగ్ రన్‌లో ఆర్ఆర్ఆర్ కొత్త రికార్డులు సెట్ చేయడం ఖాయమంటున్నారు. 

Also Read: Suryakumar Yadav: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌.. ఢిల్లీతో మ్యాచ్‌కు దూరమయిన స్టార్ బ్యాటర్! ఏబీడీకి ఛాన్స్!!

Also Read: CSK vs KKR Turning Point: మ్యాచ్ టర్నింగ్ పాయింట్.. అంతా జడేజానే చేశాడు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News