AB De Villiers Team: ఐసీసీ ప్రపంచకప్ 2023 ముగిసిన తరువాత మొత్తం టోర్నీలో కొంతమంది ఆటగాళ్లు అందరి దృష్టీ ఆకర్షించారు. దక్షిణాఫ్రికా దిగ్గజ మాజీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ అత్యుత్తమ ప్రపంచకప్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ప్రకటించారు. ఇందులో టీమ్ ఇండియా ఆటగాళ్లు ఏకంగా ఐదుగురు ఉన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రపంచకప్ 2023లో వివిధ జట్లు అద్భుత ప్రదర్శన కనబర్చాయి. టీమ్ ఇండియా తరపున రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, మొహమ్మద్ షమి, శ్రేయస్ అయ్యర్, రవీంద్ర జడేజాలు అందరి దృష్టినీ ఆకర్షించేలా ఆడారు. ఆస్ట్రేలియా నుంచి ట్రేవిస్ హెడ్, మిచెల్ స్టార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపాలు అద్భుతమైన ప్రదర్శన కనబర్చారు. ఇక దక్షిణాఫ్రికా నుంచి గెరార్డ్ కోయెట్జీ, శ్రీలంక నుంచి దిల్షాన్ మధుశంక రాణించారు. కివీస్ నుంచి రచిన్ రవీంద్ర అయితే సంచలనాలు నమోదు చేశాడు. కివీస్‌పై జరిగిన మ్యాచ్‌తో మొహమ్మద్ షమీ తానేంటో నిరూపించాడు. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయిన దశలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇన్నింగ్స్ ప్రపంచం చాలా కాలం గుర్తుంచుకుంటుంది. రచిన్ రవీంద్ర మొత్తం టోర్నీలో చెలరేగి ఆడాడు. విరాట్ కోహ్లీ అత్యధిక పరుగుల సాధించడమే కాకుండా సచిన్ పేరిట ఉన్న అత్యధిక వన్డే సెంచరీల రికార్డు బద్దలు కొట్టాడు. 


ప్రపంచకప్ టోర్నీలో వివిధ జట్ల ఆటగాళ్ల  ప్రదర్శన ఆధారంగా దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ బెస్ట్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ప్రకటించాడు. ప్రపంచవ్యాప్తంగా ఓ టీమ్ తయారు చేస్తే ఎవరెవరికి స్థానం ఉండాలనేది అంచనా వేశాడు. ఏబీ డివిలియర్స్ ప్రకటించిన ప్రపంచ జట్టులో ఐదుగురు భారతీయ ఆటగాళ్లే ఉన్నారు. ఏబీ డివిలియర్స్ ప్రకటించిన ఎలైట్ జట్టులో వివిధ దేశాలకు చెందిన బ్యాటర్లు, బౌలర్లు ఉన్నారు. 


వీరిలో టీమ్ ఇండియా తరపున రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, మొహమ్మద్ షమి, రవీంద్ర జడేజాలున్నారు. ఐసీసీ ఎంపిక చేసిన ప్రపంచజట్టులోని ఆటగాళ్లు జస్ప్రీత్ బూమ్రా, కేఎల్ రాహుల్‌లకు చోటు దక్కలేదు. ఆస్ట్రేలియా తరపున ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపాలకు స్థానం కల్పించాడు. న్యూజిలాండ్ నుంచి ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర, దక్షిణాఫ్రికా నుంచి గెరార్డ్ కోయెట్జీ, శ్రీలంక నుంచి దిల్షాన్ మధుశంకలకు చోటిచ్చాడు.


ఏబీ డివిలియర్స్ ప్రపంచకప్ ప్లేయింగ్ 11 జట్టు


రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, మొహమ్మద్ షమి, రవీంద్ర జడేజా ( ఇండియా), ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఆడమ్ జంపా ( ఆస్ట్రేలియా), రచిన్ రవీంద్ర ( న్యూజిలాండ్), గెరార్డ్ కోయెట్జీ ( దక్షిణాఫ్రికా), దిల్షాన్ మధుశంక ( శ్రీలంక)


Also read: IPL 2024 Auction: ఐపీఎల్ 2024 లో కీలక మార్పులు, అన్ని ఫ్రాంచైజీల దృష్టి ఆ ముగ్గురిపైనే



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook