SRH vs RR, Fans Wishes to Sunrisers Hyderabad for IPL 2022: ఐపీఎల్‌ 2022 మ్యాచ్‌లు అన్ని రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికి నాలుగు మ్యాచ్‌లు జరగ్గా.. అభిమానులకు మంచి వినోదాన్ని అందించాయి. ఈరోజు కూడా మరో ఇంట్రెస్టింగ్‌ ఫైట్‌ జరగనుంది. రాజస్థాన్‌ రాయల్స్‌తో తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని తెలుగు ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గతేడాది లీగ్‌ దశలోనే ఇంటి ముఖం పట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఈసారి సరికొత్తగా కనబడుతోంది. గతంలో ఎస్‌ఆర్‌హెచ్‌కు ఆడిన డేవిడ్‌ వార్నర్‌, జానీ బెయిర్‌స్టో, మనీష్‌ పాండే, రశీద్‌ ఖాన్‌, విజయ్‌ శంకర్‌, మహ్మద్‌ నబీ లాంటి స్టార్ ఆటగాళ్లు ఈ సీజన్‌లో లేరు. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌లో కేన్‌ విలియమ్సన్‌, రాహుల్‌ త్రిపాఠి, ఐడెన్ మార్కరం, ప్రియమ్‌ గార్గ్‌, నికోలాస్‌ పూరన్‌, గ్లెన్‌ ఫిలీప్స్‌ కీలకం కానున్నారు. కేన్ మామ, ఐడెన్ నిలకగా రాణించగలరు. అయితే మెరుపులు మెరిపించగల సత్తా ఉన్న ఫిలీప్స్‌, పూరన్‌కు నిలకడలేమి ప్రతికూలంగా మారనుంది. అయితే ఈ ఇద్దరు చెలరేగిగే పరుగుల వరద పారనుంది. వీరికి త్రిపాఠి, గార్గ్‌ కూడా తోడైతే.. ఎదురుండదు. 


మాక్రో జేన్సన్‌, అబ్దుల్‌ సమద్‌, అభిషేక్‌ శర్మ, వాషింగ్టన్‌ సుందర్‌, షెపర్డ్‌ లాంటి ఆల్‌రౌండర్‌లు సన్‌రైజర్స్ సొంతం. సుందర్‌, షెపర్డ్‌, జేన్సన్‌లపై భారీ అంచనాలు ఉన్నాయి. ముగ్గురిలో ఒక్కరు చెలరేగినా.. భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది. ఇక బౌలింగ్‌ లైనప్‌ చూస్తే సీన్ అబాట్‌, భువనేశ్వర్‌ కుమార్‌, టీ నటరాజన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, కార్తీక్‌ త్యాగిలతో పటిష్టంగా ఉంది. నటరాజన్‌, భువనేశ్వర్‌, అబాట్‌ ఆరంభంలోనే వికెట్లు పడగొట్టగలరు. ఇక జగదీశ సుచిత్‌, శ్రేయస్‌ గోపాల్ స్పిన్నర్ల కోటాలో ఉన్నారు. ఈ ఇద్దరు గతంలో సత్తాచారు. 


అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్.. రాజస్థాన్ రాయల్స్ జట్టుపై గెలుపొంది టోర్నీలో శుభారంభం చేయాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. నేడు ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ తొలి మ్యాచ్ ఆడుతున్న నేపథ్యంలో ఫాన్స్ అందరూ సోషల్ మీడియా వేదికగా విషెష్ చెపుతున్నారు. 'బెస్ట్ ఆఫ్ లక్ సన్‌రైజర్స్ హైదరాబాద్', 'సన్‌రైజర్స్.. ఎదురొచ్చిన జట్టును ఏసుకుంటూ పోవాలే', 'కేన్ మామ.. ఈసారి కప్పు మనదే' అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. 


Also Read: Sanskiti Mahotsav: వరంగల్ వేదికగా రెండ్రోజులపాటు జాతీయ సంస్కృతి మహోత్సవాలు


Also Read: ITR benefits: ఆదాయం తక్కువ ఉన్నా ఐటీఆర్​ దాఖలు చేస్తే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook