ICC Suspends Sri Lanka Cricket: శ్రీలంకకు భారీ షాక్ తగిలింది. శ్రీలంక క్రికెట్ (SLC) సభ్యత్వాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రద్దు చేసింది. శ్రీలంక క్రికెట్‌ బోర్డులో ప్రభుత్వ జోక్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఐసీసీ సభ్య దేశంగా శ్రీలంక తన బాధ్యతలను ఉల్లంఘించిందని పేర్కొంది. నవంబర్ 21న జరగనున్న ఐసీసీ సమావేశంలో శ్రీలంక క్రికెట్ బోర్డుకు సంబంధించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. గత నాలుగేళ్లలో ఐసీసీ సస్పెన్షన్‌కు గురైన రెండో దేశంగా శ్రీలంక నిలిచింది. శ్రీలంక సస్పెండ్ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ఐసీసీ వెల్లడించింది. సస్పెన్షన్ షరతులను ఐసీసీ బోర్డు తగిన సమయంలో నిర్ణయిస్తుందని తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2019లో జింబాబ్వే క్రికెట్ బోర్డుపై ఐసీసీ నిషేధం విధించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ జోక్యంతో జింబాబ్వే క్రికెట్ బోర్డు కూడా సస్పెన్షన్‌కు గురైంది. క్రికెట్ బోర్డులో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం కూడా శ్రీలంక క్రికెట్ బోర్డుకు శాపంగా మారింది. ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక.. కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది. నాలుగు పాయింట్లతో కింది నుంచి రెండోస్థానంలో ఉంది. జట్టు పేలవమైన ప్రదర్శనతో శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యులందరినీ తొలగించారు. నవంబర్ 7న శ్రీలంక కోర్టు బోర్డు అధికారులందరినీ ప్రభుత్వం తొలగించగా.. తాజాగా బోర్డును ఐసీసీ సస్పెండ్ చేసింది. 2024 జనవరి- ఫిబ్రవరిలో ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్‌కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. తాజా నిర్ణయంతో శ్రీలంకకు ఆతిథ్యం దక్కడం కూడా అనుమానంగా మారింది. 


ఈ ప్రపంచకప్‌లో టీమిండియా చేతిలో శ్రీలంక జట్టు 302 పరుగుల తేడాతో ఓడిపోవడం బాగా దెబ్బ తీసింది. భారత బౌలర్ల దెబ్బకు కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయింది. ఆ తరువాత వెంటనే క్రికెట్ బోర్డులోని సభ్యులు అందరినీ తొలగించారు. దిగ్గజ ఆటగాడు, మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగను బోర్డు తాత్కాలిక సభ్యుడిగా నియమించారు. పెద్ద జట్లతో కనీస పోటీ ఇవ్వలేకపోయిన శ్రీలంక.. పాకిస్థాన్‌పై 340 పైగా రన్స్‌ చేసినా కాపాడులేకపోయింది. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్‌ వంటి జట్ల చేతిలో కూడా ఓటమిపాలై.. టోర్నీ నుంచి అవమానకర రీతిలో నిష్క్రమించింది. టాప్-8లో నిలిచే ఛాన్స్ కూడా లేకపోవడంతో వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆడడం కూడా కష్టమే. 


Also Read: SA Vs AFG World Cup 2023: ముగిసిన అఫ్గాన్ అద్భుత పోరాటం.. చివరి మ్యాచ్‌లో ఓటమి


Also Read: Diwali Offers: ఫ్లిప్‌కార్ట్‌లో ఎలక్ట్రిక్ బైకుల విక్రయాలు..దీపావళి సందర్భంగా ఈ బైక్ రూ. 58,999కే పొందవచ్చు!  


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook