Sri Lanka Cricketer Dilhara Lokuhettige Banned: క్రికెట్‌ను సాధారణంగా జెంటిల్మెన్ గేమ్ అని పిలుస్తారు. అయితే ఎవరైనా క్రికెటర్ చిన్న తప్పిదాలు చేస్తే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ICC) గానీ, జాతీయ జట్టుగానీ మందలించి వదిలేస్తుంది. క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే అవినీతి ఆరోపణలు, ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీలంక క్రికెటర్‌పై 8 ఏళ్లపాటు వేటు పడింది. 3 ఏప్రిల్ 2019 నుంచి అతడిపై నిషేధం అమలులోకి రానుందని ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రీలంక క్రికెటర్ దిల్హారా లోకుహెట్టిగే‌పై ఐసీసీ 8 ఏళ్లు నిషేధం విధించింది. లోకుహెట్టిగే ఎనిమిదేళ్లపాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు దూరం కానున్నాడు. ఐసీసీకి చెందిన అవినీతి నిరోధక విభాగం అధికారులు శ్రీలంక జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన దిల్హారా లోకుహెట్టిగే అవినీతి, ఫిక్సింగ్‌లకు పాల్పడినట్లు గుర్తించింది. ఐసీసీ ఆర్టికల్ 2.1.1 - ఫిక్సింగ్ చేయడానికి సహకరించడం, ఫిక్సింగ్‌కు పాల్పడటం, మ్యాచ్ ఫలితాన్ని మార్చడానికి అంగీకరించడం లాంటి తప్పిదాలను ఐసీసీ(ICC) యాంటీ కరప్షన్ విభాగం గుర్తించింది.


Also Read: IPL 2021 Funny Memes: జానీ బెయిర్‌స్టో హిట్ వికెట్‌పై పేలుతున్న జోక్స్, Viral అవుతున్న ఫన్నీ మీమ్స్



ఆర్టికల్ 2.1.4 - ఇతరులను ప్రత్యక్షంగాగానీ, లేక పరోక్షంగా గానీ ప్రలోభపెట్టడం. ఐసీసీ నిబంధనలు ఉల్లంఘించేందుకు సలహాలు ఇవ్వడం, ఆశ చూపడం లాంటి తప్పిదాలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు నిర్వహించిన టీ10 లీగ్‌లో నిబంధనలు ఉల్లంఘించడంతో ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.


ఐసీసీ జనరల్ మేనేజర్ అలెక్స్ మార్షల్ మాట్లాడుతూ.. శ్రీలంక(Sri Lanka)కు అంతర్జాతీయ మ్యాచ్‌లలో ప్రాతినిథ్యం వహించిన దిల్హారా లోకుహెట్టిగే పలుమార్లు నిబందనలు ఉల్లంఘించినట్లు గుర్తించామని, కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.


Also Read: IPL 2021: CSK కెప్టెన్‌గా 200వ మ్యాచ్, MS Dhoniపై నిషేధం వేటు పడనుందా 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook