IPL 2021: CSK కెప్టెన్‌గా 200వ మ్యాచ్, MS Dhoniపై నిషేధం వేటు పడనుందా 

MS Dhoni Ban Latest News: 199 మ్యాచ్‌లకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించగా, గాయంతో దూరమైన మ్యాచ్‌కు సురేశ్ రైనా సారథిగా వ్యవహరించాడు. పంజాబ్ కింగ్స్‌పై సీఎస్కే విజయం సాధించింది. 

Written by - Shankar Dukanam | Last Updated : Apr 19, 2021, 09:40 AM IST
IPL 2021: CSK కెప్టెన్‌గా 200వ మ్యాచ్, MS Dhoniపై నిషేధం వేటు పడనుందా 

IPL 2021: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఫ్రాంచైజీలో 200 మ్యాచ్ ఇటీవల సెలబ్రేట్ చేసుకున్నాడు. 199 మ్యాచ్‌లకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించగా, గాయంతో దూరమైన మ్యాచ్‌కు సురేశ్ రైనా సారథిగా వ్యవహరించాడు. పంజాబ్ కింగ్స్‌పై సీఎస్కే విజయం సాధించింది. అయితే శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ ఊహించినట్లుగానే బౌలింగ్ కోటాపై ఫోకస్ చేశాడు. 2 నిమిషాల ముందే బౌలింగ్ కోటా పూర్తి చేయించాడు. అయినా ఎంఎస్ ధోనీ ముందు నిషేధం కత్తి వేలాడుతూనే ఉంది.

ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్(CSK) తమ తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై స్లో ఓవర్ రేటు కారణంగా ధోనీకి రూ.12 లక్షల జరిమానా విధించారు. వరుసగా మరో రెండు మ్యాచ్‌లలో ఇదే తప్పిదం జరిగితే ఎంఎస్ ధోనీని కనిష్టంగా రెండు మ్యాచ్‌లు, గరిష్టంగా 4 మ్యాచ్‌లు నిషేధించనున్నారు. ఈ క్రమంలో తమ రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడింది. 90 నిమిషాల్లో పూర్తి చేయాల్సిన బౌలింగ్ కోటాను సీఎస్కే బౌలర్లు 88 నిమిషాల్లో పూర్తి చేశారు.

Also Read: IPL 2021 Funny Memes: జానీ బెయిర్‌స్టో హిట్ వికెట్‌పై పేలుతున్న జోక్స్, Viral అవుతున్న ఫన్నీ మీమ్స్

చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లు తమ తరువాతి మ్యాచ్‌లోనూ 90 నిమిషాల్లో 20 ఓవర్ల బౌలింగ్ కోటాను పూర్తి చేయాల్సి ఉంటుంది. లేని పక్షంలో కెప్టెన్ ఎంఎస్ ధోనీపై వేటు పడుతుంది. ఎంఎస్ ధోనీ(MS Dhoni)పై కనీసం రెండు మ్యాచ్‌లు గరిష్టంగా 4 మ్యాచ్‌ల వరకు నిషేధం విధిస్తారు. దీనిపై మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకుంటాడు. నేడు (ఏప్రిల్ 19న) వాంఖేడే స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్‌(Rajasthan Royals)తో సీఎక్కే తలపడనుంది. 12.7.3 క్లాజ్ ప్రకారం కొన్ని సందర్భాలలో సమయాన్ని లెక్కించరు. 

1. మైదానంలో ఎవరైనా ఆటగాడికి చికిత్స అందిస్తే, ఆ సమయాన్ని బౌలింగ్ కోటా సమయం నుంచి మినహాయిస్తారు.

2. ఎవరైనా ఆటగాడు గాయపడ్డ సందర్భంలో గాయం తీవ్రతను పరిశీలించి మైదానాన్ని వీడనున్న నేపథ్యంలో అందుకుగానూ తీసుకునే సమయాన్ని లెక్కించరు

3. థర్డ్ అంపైర్ నిర్ణయాలు తీసుకునే సమయం. ఆటగాళ్లు తీసుకునే అంపైర్ లేదా ప్లేయర్ రివ్యూలు

4. బ్యాటింగ్ జట్టు తీసుకునే ఎక్స్‌ట్రా టైమ్‌ను బౌలింగ్ కోటా సమయం నుంచి మినహాయిస్తారు

5. ఫీల్డింగ్ ఏర్పాటు చేసుకోవడం, మంతనాలు జరపడం లాంటివి కాకుండా ఇతరత్రా కారణాలకు వెచ్చించే సమయాన్ని బౌలింగ్ కోటా నుంచి మినహాయిస్తారు.

Also Read: ICC T20 World Cup: ఢిల్లీ వేదికగా పాకిస్తాన్ మ్యాచ్‌లు ఖరారు, ఫైనల్ వేదికపై స్పష్టత వచ్చింది 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News