తగలరాని చోట తాకిన బెయిల్.. మైదానంలో అక్కడ చేయి పెట్టుకుని విలవిలలాడిపోయిన వార్నర్ (వీడియో)
Bail Hits David Warners Crotch Sri Lanka vs Australia 1st Test. శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు వికెట్ల మీది బెయిల్ తగలరాని చోట తగిలింది.
Bail Hits David Warners Crotch, Video Getting Viral: శ్రీలంకపై టీ20 సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా గొప్పగా పుంజుకుంది. గాలే వేదికగా ముగిసిన తొలి టెస్టులో ఆసీస్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లంక నిర్దేశించిన 5 పరుగుల లక్ష్యాన్ని కంగారో జట్టు తొలి ఓవర్‌లోనే వికెట్ కోల్పోకుండా చేధించింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 4 బంతుల్లో ఓ ఫోర్, సిక్స్ సాయంతో 10 పరుగులు చేసి లాంఛనాన్ని పూర్తిచేశాడు. హాఫ్ సెంచరీ బాదిన ఆసీస్ బ్యాటర్ కామెరాన్ గ్రీన్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. అయితే ఈ మ్యాచులో ఓ ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది.
తొలి టెస్టులో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు వికెట్ల మీది బెయిల్ తగలరాని చోట తగిలింది. ఈ ఘటన శ్రీలంక ఇన్నింగ్స్ 22వ ఓవర్లో చోటుచేసుకుంది. శ్రీలంక బ్యాటర్ జెఫ్రీ వాండర్సే స్ట్రైకింగ్‌లో ఉండగా.. లసిత్ ఎంబుల్దేనియా నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్నాడు. ఆసీస్ బౌలర్ ట్రావిస్ హెడ్ 22వ ఓవర్లోని చివరి బంతిని వేయగా.. వాండర్సే డిఫెన్స్ చేసే ప్రయత్నం చేశాడు. బాగా టర్న్ అయిన బంతి లెగ్ వికెట్‌ని తాకి స్లిప్‌లో గాల్లోకి లేచింది. స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న వార్నర్ తనవైపు వచ్చిన బంతిని అందుకునే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో గాల్లోకి లేచిన బెయిల్.. వార్నర్‌కు తగలరాని చోట (వృషణాలు) తాకింది.
బెయిల్ తగలరాని చోట తగలడంతో డేవిడ్ వార్నర్ నొప్పితో విలవిలలాడిపోయాడు. మైదానంలోనే కిందపడి మరీ దొర్లాడు. కాసేపటికి తేరుకున్న డేవిడ్ భాయ్.. ఎప్పటిలా ఫీల్డింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ సోషమీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకి కామెంట్ల వర్షం కురుస్తోంది. 'అయ్యో పాపం డేవిడ్ భాయ్' అని ఒకరు కామెంట్ చేయగా.. 'దేవ్ భాయ్.. గట్టిగా తగిలినట్టు ఉందే' అని ఇంకొకరు ట్వీట్ చేశారు.
తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 212 పరుగులకే ఆలౌటైంది. డిక్వెల్లా 58 పరుగులు చేశాడు. ఆపై మొదటి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 321 పరుగులు చేసింది. కామోరాన్ గ్రీన్ (77), ఉస్మాన్ ఖవాజా (71) రాణించడంతో ఆస్ట్రేలియాకు 109 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో లంక 113 పరుగులకే కుప్పకూలింది. కరుణరత్నె (23) టాప్ స్కోరర్. రెండో ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఆసీస్ విజయం సాధించింది.
Also Read: అయ్య బాబోయ్.. మరీ ఇంత అభిమానమా! వీపుపై విజయ్ దేవరకొండ టాటూ
Alos Read: నాటువైద్యం తీసుకుంటున్న ఎంఎస్ ధోనీ.. ఎంత చెల్లిస్తున్నాడో తెలిస్తే షాకవుతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook