Lady Fan Cherry gets Tattoo Vijay Devarakonda's Image on her Back Side: ఎక్కడైనా సినిమా హీరో హీరోయిన్లకి చాలా మంది అభిమానులు ఉంటారు. అభిమానించే హీరో లేదా హీరోయిన్ని కలిసి మాట్లాడి సంతోషపడుతుంటారు కొంతమంది.. వారి పేర్లని టాటూ వేయించుకుని ఆనందపడుతారు ఇంకొందరు. ఇక మరికొంతమంది పిచ్చి అభిమానులు అయితే తమ అభిమాన హీరో, హీరోయిన్ ఫోటోలని పచ్చబొట్టు వేయించుకుంటారు. ఇటీవల సాయి పల్లవిపై వీరాభిమానంతో ఓ అభిమాని తన గుండెలపై ఆమె బొమ్మను టాటూగా వేయించుకోగా.. తాజాగా విజయ్ దేవరకొండకి వీరాభిమాని అయిన ఓ లేడీ ఫ్యాన్ రౌడీ హీరో ఫోటోని తన వీపుపై పచ్చబొట్టుగా వేయించుకుంది.
ఓ అమ్మాయి (చెర్రీ) విజయ్ దేవరకొండ ఫోటోని తన వీపుపై పచ్చబొట్టు వేయించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చుసిన విజయ్.. చెర్రీని లైగర్ సినిమా ఆఫీస్‌కి పిలిపించాడు. చెర్రీతో పాటు మరో ఫ్యాన్ సోనాలి కూడా లైగర్ ఆఫీస్‌కి వెళ్లారు. అక్కడ వారిద్దరూ రౌడీ హీరోను కలిశారు. ఇద్దరితో సరదాగా ముచ్చటించిన విజయ్.. వారితో కలిసి ఫొటోలు దిగాడు. ఆపై తాను వేయించుకున్న టాటూను చూపిస్తూ సిగ్గుపడిపోయింది చెర్రీ. అంతటి అభిమానానికి విజయ్ షాక్ అయ్యాడు.
విజయ్ దేవరకొండ తన ఇద్దరు అభిమానులను దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత ఛార్మికి పరిచయం చేశాడు. ఆ తర్వాత చెర్రీ తన వీపుపై ఉన్న విజయ్ టాటూని ఛార్మికి చూపించగా.. ఆమె కూడా అవాక్కయారు. ఎందుకు టాటూ వేయించుకున్నావు అని విజయ్ అడగడంతో.. చెర్రీ ఎమోషనల్ అయింది. దీంతో విజయ్ ఆమెని దగ్గరికి తీసుకుని హత్తుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకి లైకుల వర్షం కురుస్తోంది.
"SUPER FAN MOMENT" - Some FANS convey their affection in a most personal way and High Respect when they ink their Star on their Body
Dr. Cherry - Hope you had best surprise meeting VD Sir and you cherish this moment@TheDeverakonda #VijayDeverakonda #TeamDeverakonda pic.twitter.com/8CuxiyJUbt
— Team Deverakonda (@TeamDeverakonda) June 30, 2022
విజయ్ దేవరకొండ హీరోగా డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘లైగర్’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉంది. ఇప్పటికే లైగర్ నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ వినిమా ఆగస్టు 25న విడుదల కానుంది.
Also Read: Rain Alert: దేశమంతటా విస్తరించిన నైరుతి రుతు పవనాలు..లెటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదే..!
Also Read: July 1st OTT Releases: విరాటపర్వం టు ధాకడ్.. నేడు ఏయే సినిమాలు, సిరీసులు రిలీజయ్యాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook