Rashid Khan Wedding: తన ఆటతో యావత్‌ క్రికెట్‌ ప్రియులను కట్టిపడేసిన అఫ్ఘానిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ వివాహం చేసుకున్నాడు. బంధుమిత్రులు, కుటుంబసభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా అతడి పెళ్లి జరిగింది. అయితే తనతోపాటు అతడి సోదరులు కూడా ఒకేసారి వివాహం చేసుకున్నారు. ఒకేసారి ముగ్గురు వివాహాలు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఎంతోకాలంగా బ్యాచిలర్‌గా ఉన్న రషీద్‌ తన కల తీరకుండానే వివాహం చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. గతంలో అతడు చేసిన శపథం నెరవేరకుండానే వివాహమాడడం ట్రోలింగ్‌కు దారి తీసింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Smriti Mandhana: 'నేను కడుపులోనే క్రికెట్‌ నేర్చుకున్నా' స్టార్‌ క్రికెటర్‌ కామెంట్స్‌ వైరల్‌


అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్‌లలో ఒకడైన రషీద్ ఖాన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. సంప్రదాయ పద్ధతిలో అతడి వివాహ తంతు జరిగింది. అఫ్గాన్ రాజధాని కాబూల్‌లో పష్తూన్ ఆచారాల ప్రకారం అతడి పెళ్లి జరగ్గా భారీ ఎత్తున అభిమానులు కూడా తరలివచ్చారు. గురువారం రాత్రి జరిగిన వివాహ వేడుకకు అఫ్గాన్ క్రికెటర్లంతా హాజరై సందడి చేశారు. అయితే రషీద్‌తో పాటు అతడి ముగ్గురు సోదరులు కూడా అదే సమయానికి వివాహం చేసుకోవడం ఆసక్తికరం. ఈ సందర్భంగా వీరి పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.


Also Read: Banana Facts: విరాట్‌ కోహ్లి, సచిన్‌ రికార్డులకు కారణం అరటి పండు.. ఎందుకో తెలుసా?


క్రికెటర్ల సందడి
ఈ సామూహిక పెళ్లికి అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టు మొత్తం హాజరైంది. సీనియర్‌ ఆటగాడు మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, నజీబుల్లా జద్రాన్, రహ్మత్ షా, ముజీబ్ ఉర్ రెహ్మాన్‌తోపాటు అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు సీఈవో నసీబ్ ఖాన్ వివాహానికి వచ్చారు.


కల తీరకుండానే..
తమ దేశానికి ప్రాతినిథ్యం వాస్తవానికి రషీద్‌ ఖాన్‌ గతంలో ఒక శపథం పూనారని పుకార్లు వచ్చాయి. 'అఫ్గానిస్థాన్ జట్టు ప్రపంచ కప్ గెలిచిన తరువాత నేను పెళ్లి చేసుకుంటా. అప్పటివరకు పెళ్లి ప్రస్తావన ఎత్తను' అని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీంతో క్రికెట్‌ప్రియులు అందరూ షాకయ్యారు. ఇదే క్రమంలో అఫ్గానిస్థాన్ తొలిసారిగా 2024లో టీ20 ప్రపంచ కప్‌లో సెమీ ఫైనల్‌కు చేరుకుంది. ఇక అఫ్గాన్‌కు ప్రపంచకప్‌ ఖాయమని అందరూ భావించారు. కానీ నిరాశ తప్పలేదు. వయసు పెరుగుతుండడంతో ప్రపంచకప్‌ కల తీరకపోయినా పర్లేదు అని తన శపథాన్ని వీడి రషీద్‌ ఖాన్‌ వివాహం చేసుకున్నాడు.





స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.FacebookTwitter