మరికొన్ని గంటల్లో భారత్-కివీస్ జట్ల మధ్య వరల్డ్ కప్ సెమీ ఫైనల్ పోరు మొదలు కానుంది . ఈ నేపథ్యంలో  గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ రోజు జరిగే సెమీస్ పోరుపై టీమిండియా సారధి కోహ్లీ స్పందించాడు.సెమీఫైనల్స్‌లో ప్రత్యర్థి కంటే ముందు ఒత్తిడిని జయించాల్సి ఉందన్నాడు. ఒత్తిడిని జయిస్తే సగం మ్యాచ్ గెలిచినట్లేనని లాజిక్ గా మాట్లాడాడు. లీగ్ దశలో సాధించిన విజయాల స్పూర్తితో సెమీస్ ఫైనల్ మ్యాచ్ లో బరిలోకి దిగుతున్నాడు.  తమ జట్టు సభ్యులపై తనకు పూర్తి భరోసా ఉందని..ఆత్మవిశ్వాసంతోనే బరిలోకి దిగుతామని కోహ్లీ తెలిపాడు. 
పిచ్, టాస్ తో సంబంధం లేదు...
టాస్ గురించి కోహ్లీ స్పందిస్తూ ఈ మ్యచ్ లో టాస్ కీలకం కానుందని తెలిపాడు. రెండో ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చాలా ఒత్తిడి ఉంటుందని.. అయితే టాస్‌ అనేది అది మన చేతుల్లో లేదు కాబట్టి.. దాని గురించి పెద్దగా ఆలోచించడం లేదని ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొందుకు పడగ్భంధి వ్యూహంతో బరిలోకి దిగుతున్నామన్నాడు. తమ జట్టు సభ్యులపై తనకు పూర్తి నమ్మకం ఉందని సమష్ఠిగా రాణించి విజయాన్ని సాధిస్తామని టీమిండియా సారధి ధీమా వ్యక్తం చేశాడు.


పొరపాట్లకు దూరం
మ్యాచ్ పై పట్టు సాధించాలంటే ఏ ఫార్మెట్ లోనూ బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఇలా ఎక్కడా తప్పులు కూడా చేయకూడదని..ఏమాత్రం చిన్నపాటి పొరపాటు జరిగినా మ్యాచ్‌ ప్రత్యర్థుల చేతుల్లోకి వెళ్లిపోతుందని ... గత మ్యాచుల్లో ఇది అనుభవపూర్వకంగా చూశామన్నారు. ఈ నేపథ్యంలో ఏమాత్రం తప్పులు దొర్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నాడు. ఈ మ్యాచ్ లో పిచ్‌తో సంబంధం లేదు..అది ఎలాంటిదైనా మెరుగ్గా ఆడేందుకు ప్రయత్నిస్తానమి టీమిండియా సారధి కోహ్లీ ధీమా వ్యక్తం చేశాడు.