Stunning Catch: క్రికెట్ చరిత్రలో అద్భుతమైన క్యాచ్.. ఎలా సాధ్యమైంది భయ్యా..!
Wonderful Catch At Boundary Line: ఇటీవల బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ల విన్యాసాలు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. డైవ్ చేస్తూ.. బౌండర్ లైన్ క్రాస్ చేస్తూ గాల్లో సూపర క్యాచ్‌లు అందుకుంటున్నారు. అయితే వీటన్నింటికి మించి ఓ ఫీల్డర్ బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టేశాడు. ఇలాంటి క్యాచ్‌ను మీరు ఎప్పుడు చూసి కూడా ఉండరు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Wonderful Catch At Boundary Line: క్రికెట్ ఫీల్డ్‌లో మీరూ ఎన్నో క్యాచ్‌లు చూసుంటారు. కానీ ఇలాంటి క్యాచ్ మాత్రం కచ్చితంగా ఎప్పుడు చూసుండరు. బౌండరీ లైన్ దగ్గర ఓ ఫీల్డర్ చేసిన విన్యాసాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. క్రికెట్‌లో ఫుట్‌బాల్‌ను మిక్స్ చేసి.. చివరికి బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపించారు. క్రికెట్‌లో క్యాచ్‌లు ఎంత కీలకమో తెలిసిందే. ఒక్క క్యాచ్ విడిచిపెట్టినా.. మ్యాచ్ ఫలితం అటు ఇటు అవుతుంటుంది. మ్యాచ్ పీక్ స్టేజ్‌లో అద్భుతమైన క్యాచ్‌లు అందుకుని మలుపుతిప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
శ్రీ చషక్ అనే క్రికెట్ టోర్నీలో బెల్గాంకు చెందిన ఫీల్డర్ కిరణ్ తర్లేకర్ బౌండరీ లైన్ వద్ద కళ్లుతిరిగే విన్యాసాలు చేశాడు. జావెద్ అనే బౌలర్ కాళ్ల ముందు బంతి వేయగా.. మగురే అనే బ్యాట్స్‌మెన్ బంతిని బలంగా బాదాడు. బాల్ బౌండరీ లైన్ వద్దకు చేరుకోవడంతో అందరూ సిక్స్ అని భావించారు. కానీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కిరణ్.. అమాంతం గాల్లోకి ఎగిరిన బంతిని పట్టేశాడు.
కానీ బ్యాలెన్స్ తప్పడంతో బౌండరీ క్రాస్ చేశాడు. ఈలోపే బాల్‌ను గాల్లోకి విసిరాడు. తిరిగి బాల్ నేలకు టచ్ అయ్యే లోపే.. బౌండరీ లైన్ ఆవల నుంచి గాల్లోకి ఎగిరి బాల్‌ను ఫుట్‌బాల్‌లా కాలితో గాల్లోకి తన్నాడు. దీంతో బాల్ గాల్లోకి లేచి గ్రౌండ్‌లో ఉన్న మరో ఫీల్డర్ చేతుల్లో పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా భారీగా వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో ఈ వీడియోను ఓంకార్ అనే వ్యక్తి పోస్ట్ చేశాడు. దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండుల్కర్, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ కూడా ఈ వీడియోపై స్పందిస్తున్నారు. ఫుట్‌బాల్ ఆడే వ్యక్తిని క్రికెట్ కూడా ఆడిస్తే ఇలా జరుగుతుందంటూ ఫన్నీ కామెంట్ చేశాడు. ఇది కచ్చితంగా ఆల్‌టైమ్ గ్రేటెస్ట్ క్యాచ్ అని మైఖేల్ వాన్ ట్వీట్ చేశాడు. ఔట్‌స్టాండింగ్ అంటూ ఫీల్డర్‌పై కివీస్ ఆల్‌రౌండర్ ఆల్‌రౌండర్ జిమ్మీ నీషమ్ అభినందించాడు.
Also Read: Pawan Kalyan: ఆడ బిడ్డలకు రక్షణ ఉందా..? అంధ యువతి హత్య ఘటనపై పవన్ ఆవేదన
Also Read: Google Office Bomb Threat: గూగుల్ ఆఫీస్‌కు బాంబ్ బెదిరింపు కాల్.. పరుగులు పెట్టిన పోలీసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook